WHO Alert: బాంబు పేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, కొత్త వేరియంట్ పై హెచ్చరిక!

ఈజీ-5 అనే కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరించింది

  • Written By:
  • Publish Date - August 16, 2023 / 02:08 PM IST

కరోనా  నుంచి ఉపశమనం పొందామని అనుకునేలోపు ప్రపంచ ఆరోగ్య సంస్థ  మరో బాంబు పేల్చింది.  ఈజీ-5 అనే కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోందని హెచ్చరించింది. ఈ వేరియంట్‌ను ఇప్పటికే 51 దేశాల్లో గుర్తించామని తెలిపింది.  ఈజీ-5.. ఒమిక్రాన్ ఉత్పరివర్తన అని వెల్లడించింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నా నిర్ధారణ పరీక్షల్లో ఆలసత్వం వద్దని డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ దేశాలను హెచ్చరించింది.

ప్రస్తుతం అమెరికాలోనూ ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా భారత్ లోకి కూడా ఈ వేరియంట్ ఎంటరైందని వైద్యులు చెబుతున్నారు. మహారాష్ట్రలో ఈజీ.5 వేరియంట్ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు. ఎరిస్ అని పిలిచే ఈ కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయని చెప్పారు. అయితే, ఇప్పటికి రెండు నెలలు గడిచినా ఈ కేసుల్లో పెరుగుదల కనిపించకపోవడం కొంత ఊరటేనని వివరించారు. అయితే, వైరస్ లక్షణాల్లో తీవ్రత పెద్దగా కనిపించలేదని, బాధితులు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రాలేదని వివరించారు.

ఒమిక్రాన్ వేరియంట్ లో కలిగిన జన్యుమార్పులతోనే ఈ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వేరియంట్ బాధితుల్లోనూ ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలే కనిపిస్తాయని వివరించారు. ముక్కుకారడం, తుమ్ములు, విపరీతమైన తలనొప్పి, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తున్నాయని వివరించారు.

Also Read: Pawan Kalyan: త్యాగమూర్తి అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే గొప్ప వాగ్దాటి!