Site icon HashtagU Telugu

Bill Gates Office : పోర్న్ చూస్తావా.. వివాహేతర సంబంధం ఉందా.. ఆ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలట : వాల్ స్ట్రీట్ జర్నల్

Bill Gates

bill gates

Bill Gates Office : “నువ్వు ఎలాంటి పోర్న్ మూవీస్ చూడటానికి ఇష్టపడతావ్”

“నీకు వివాహేతర సంబంధాలు గతంలో ఉండేవా”

“నీ ఫోన్ లో ఏవైనా నగ్న చిత్రాలు ఉంటే చూపించు..”

“ఎప్పుడైనా డబ్బులు తీసుకొని డ్యాన్స్ చేశావా”

“నీకు సెక్సువల్ వ్యాధులు ఏవైనా వచ్చాయా ” 

ఇలాంటి నీచపు ప్రశ్నలను మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీస్ లో జాబ్ ఇంటర్వ్యూస్ కు వచ్చే మహిళలను అడుగుతున్నారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని ప్రచురించింది !!  ప్రపంచంలోనే ధనిక వ్యాపారవేత్త బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీస్ “గేట్స్ వెంచర్స్”  లో(Bill Gates Office) జాబ్స్ భర్తీ ప్రక్రియను కాన్‌సెంట్రిక్ అడ్వైజర్స్ అనే సంస్ధ నిర్వహిస్తుంటుందని .. అది ఇలాంటి పనికిమాలిన ప్రశ్నలతో ఇటీవల కొందరు మహిళా అభ్యర్థులను వేధించిందని న్యూస్ స్టోరీలో ప్రస్తావించింది. ఈవిధమైన ప్రశ్నలను ఎదుర్కొన్న కొందరు బాధిత మహిళా క్యాండిడేట్స్ తమకు ఈ సమాచారాన్ని అందించారని వాల్ స్ట్రీట్ జర్నల్  కథనంలో పేర్కొంది. 

Also read : US University Admissions : జాతి ఆధారంగా యూనివర్సిటీల్లో అడ్మిషన్లపై బ్యాన్.. అమెరికా సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు

ఆ  ప్రశ్నలు తమను ఎంతో బాధించాయని అభ్యర్థులు చెప్పారని తెలిపింది.  ఈ వార్తల నేపథ్యంలో గేట్స్ వెంచర్స్ ప్రతినిధి ఒకరు స్పందించారు. “థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ కాన్‌సెంట్రిక్ అడ్వైజర్స్ నిర్వహించిన బ్యాక్‌గ్రౌండ్ చెక్‌ల సమయంలో, ఇంటర్వ్యూలలో  అలాంటి ప్రశ్నలు అడగలేదు. మా కంపెనీ తరఫున ఆ సంస్థ వాళ్ళు తగిన ప్రమాణాలను పాటిస్తూ రిక్రూట్మెంట్ చేస్తారు. స్త్రీ, పురుషులను జాబ్స్ కు ఎంపిక చేసే క్రమంలో ఎలాంటి వేధింపులకు తావు ఉండదు” అని స్పష్టం చేశారు.