Site icon HashtagU Telugu

Kerala Woman Moustache: మీసం మెలేస్తున్న కేరళ మహిళ.. ఫొటోలు వైరల్!

Kerala Women

Kerala Women

ఆడవాళ్లు అంటేనే అందానికి చిరునామా. డ్రస్సింగ్, లుక్స్ ప్రతి విషయంలోనూ చాలా కేరింగ్ ఉంటారు. ఫేస్ మీద ఏదైనా చిన్న మొటిమ వస్తేనే కంగారు పడిపోతారు. కానీ అలాంటిది ఓ మహిళ మూతి మీద మీసాలు వచ్చిన ఏమాత్రం భయపడలేదు. పైగా నాకు మీసాలున్నాయంటూ అందరికి చూపిస్తూ తన లోపాన్ని బయటపెట్టింది. మీసం మెలిసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ కావడంతో ఈ మహిళ హాట్ టాపిక్ గా మారింది. కేరళలోని కన్నూర్‌కు చెందిన శైజ అనే మహిళకు పై పెదవిపై అవాంఛిత రోమాలు పెరిగాయి.

సాధారణంగా ఆడవాళ్లు అలా వస్తే తొలగించుకునే ప్రయత్నం చేస్తారు.. కానీ ఈమె మాత్రం మీసం లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేనంటూ మీసం మెలేస్తూ ఫొటోలు దిగింది. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే చాలామంది షేవ్ చేసుకోమని సలహా ఇచ్చినా ఈ మహిళ మాత్రం మీసాలు తీయడానికి ఒప్పుకోవడం లేదు.