Site icon HashtagU Telugu

Wife Exchange: ఇదేం పోయేకాలం.. ఆయన భార్య ఈయనతో.. ఈయన భార్య ఆయనతో పరార్!

Wife Exchange

Wife Exchange

కలికాలం అంటే ఇదేనేమో.. పెళ్లితో పవిత్రబంధంలోకి అడుగుపెట్టిన భార్యాభర్తలు తమ బంధాన్ని విస్మరించి (Wife Exchange) తప్పుదారి పట్టారు. కలకాలం కలిసి ఉండాల్సిన జంటలు హద్దు మీరి ప్రవర్తిస్తున్నాయి. బీహార్ (Bihar) రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఆయన భార్య ఈయనతో.. ఈయనగారి భార్య ఆయనతో పారిపోయారు. ఖ‌గాఢియా జిల్లా ఛౌథామ్ బ్లాక్‌లోని హార్దియా గ్రామానికి చెందిన ముఖేశ్‌.. నీర‌జ్ భార్యతో ప‌రార‌య్యాడు. అనంత‌రం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విష‌యంపై గ్రామ పెద్ద‌లు పంచాయితీ పెట్ట‌గా.. ముఖేశ్ త‌న ప్రియురాలిని వ‌దిలి ఉండలేన‌ని స్ప‌ష్టం చేశాడు. దీంతో ముఖేశ్‌పై ప‌గ పెంచుకున్న బాధితుడు నీర‌జ్… అత‌ని మొద‌టి భార్యతో ప‌రిచ‌యం (Wife Exchange) పెంచుకున్నాడు. ఆమెను ఒప్పించి.. ఈ నెల 18న ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఈ వ్య‌వ‌హారం స్థానికంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నీర‌జ్‌కు అప్ప‌టికే న‌లుగురు సంతానం ఉండ‌గా, ముఖేశ్‌కి ముగ్గురు సంతానం. ముఖేశ్ త‌న ప్రియురాలితో వెళ్లిపోయేట‌ప్పుడు త‌న ముగ్గురు పిల్ల‌ల‌నూ తీసుకుని వెళ్లిపోయాడు. వీరి ఉదంతంలో మ‌రో ఆస‌క్తిక‌ర అంశ‌మేమిటంటే.. ముఖేశ్‌, నీర‌జ్‌ల భార్య‌ల పేర్లు ఒక‌టే కావ‌డం. ఇద్ద‌రి పేర్లూ రూబీయే. మ‌రో అంశ‌మేమిటంటే.. ముఖేశ్‌తో వెళ్లిపోయిన రూబీకి ఆమెకు వివాహం కాక‌ముందు నుంచే ప‌రిచ‌యం ఉంది. పెళ్లికి ముందు అత‌న్ని ప్రేమించింది. నీర‌జ్‌తో ఆమెకు పెళ్ల‌యిన‌ త‌ర్వాత కూడా ముఖేశ్‌తో ప‌రిచ‌యాన్ని కొన‌సాగించింది. ఈ క్ర‌మంలో గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో వీరిద్ద‌రూ (Wife Exchange) ఇంటినుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విష‌యంపై నీర‌జ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఆ త‌ర్వాత దీనిని గ్రామ పెద్ద‌లు పంచాయితీ ద్వారా తేల్చాల‌ని ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది. ప్రస్తుతం ఈ వ్యవహరం బీహార్ లో నే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇదేం పోయేకాలం.. దేవుడా.. అంటూ నెటిజన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Pawan-Sreeleela శ్రీలలకు బంపరాఫర్.. యంగ్ బ్యూటీతో పవన్ రొమాన్స్!