మృగశిర కార్తె (Mrigasira Karthi ) ప్రారంభంతో వర్షాకాలానికి స్వాగతం పలుకుతూ తెలుగు ప్రజలు చేపల కొనుగోళ్లకు పోటెత్తారు. వేసవి కాలంలో ఉక్కిరిబిక్కిరైన జనం, తొలకరి వానల్లో తడవడమే కాదు, ఆరోగ్య పరిరక్షణకూ చేపలు మేలు చేస్తాయని నమ్మకం ప్రజల్లో బలంగా ఉంటుంది. ఈ సీజన్‌లో జీర్ణశక్తి తగ్గిపోతూ, శరీర ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతినే ప్రమాదం ఉన్నందున, శరీరంలో వేడిని సమతుల్యం చేసేందుకు చేపలు ఎంతో ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెబుతారు. చేపలు తినని వారు ఇంగువతో బెల్లం తీసుకోవడం కూడా సాంప్రదాయంగా చేస్తుంటారు.
MLC Kavitha: ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది: ఎమ్మెల్సీ కవిత
చేపల్లో ఉన్న పోషకాల వివరాలను చూస్తే.. ఇవి ఆరోగ్యానికి ఎందుకు అవసరమో స్పష్టంగా తెలుస్తుంది. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు, బీ12 వంటి విటమిన్లు, ఒమేగా-3 కొవ్వులైన డీహెచ్ఏ, ఈపీఏ వంటి పదార్థాలు చేపల్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి కంటి చూపు మెరుగుపరచడంలో, జ్ఞాపకశక్తి పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకంగా పనిచేస్తాయి. గర్భిణులు, పెద్దవారు, శ్వాస సంబంధిత వ్యాధులున్నవారు ఈ సమయంలో చేపలు తింటే మరింత ఆరోగ్య ప్రయోజనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
Telangana New Cabinet : తెలంగాణ కేబినెట్‌లో కొత్త మంత్రులు వీరేనా..?
ఇక మార్కెట్ల పరిస్థితిని చూస్తే మృగశిర కార్తె రోజు చేపల విక్రయదారులకు పెద్ద పండగ. హైదరాబాద్ ముషీరాబాద్ వంటి ప్రధాన మార్కెట్లలో తెల్లవారుజాము నుంచే ప్రజలు బారులు తీరారు. కొర్రమీను వంటి డిమాండ్ ఉన్న చేపలకు ధరలు రెండింతలు అయినా వినియోగదారులు వెనుకాడలేదు. ఉత్తర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, విశాఖ వంటి ప్రాంతాల నుంచి వందలాది లారీల్లో దిగుమతి అయిన చేపలు శతానికిపైగా టన్నుల మేర అమ్మకమయ్యాయి. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సంప్రదాయం, నమ్మకంతో కూడిన ఈ రోజు చేపల మార్కెట్లలో భారీ ఆర్జనకు దారితీసింది.