Zainab Ravdje : తెలుగు సూపర్‌స్టార్ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని తన దీర్ఘకాల స్నేహితురాలు జైనబ్ రవ్జీని ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసింది. ఈ పెళ్లి శుక్రవారం తెల్లవారుఝామున 3:35 గంటలకు హైదరాబాద్‌లోని అక్కినేని ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా జరిగింది. నాగార్జున, నాగచైతన్య తమ సోషల్ మీడియా ద్వారా ఈ పెళ్లి ఫోటోలు పంచుకుంటూ జైనబ్‌ను అధికారికంగా అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానించారు.
జైనబ్ రవ్జీ ఎవరు?
జైనబ్ రవ్జీ ఒక ప్రసిద్ధ ఆధునిక చిత్రకారిణి. ఆమె త్రల చిత్రకళ, అభిజ్ఞాత్మక శైలి (Impressionistic style) లో చిత్రాలు వేయడం ద్వారా పేరొందారు. 2012లో Reflections అనే పేరుతో తన తొలి చిత్ర ప్రదర్శన నిర్వహించారు. అప్పటినుంచి ఆమె హైదరాబాద్ నగరంలోని కళా రంగంలో మంచి గుర్తింపు సంపాదించారు. జైనబ్ బిజినెస్ పరంగా కూడా గొప్ప నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ హైదరాబాదులో నిర్మాణ రంగానికి సంబంధించిన ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయనను నగరంలోని సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా భావిస్తారు. ఆమె సోదరుడు జైన్ రవ్జీ, ZR Renewable Energy Pvt Ltd అనే వారి కుటుంబ వ్యాపార సంస్థకు ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
అఖిల్ – జైనబ్ ప్రేమకథ
జైనబ్, అఖిల్ కొద్ది సంవత్సరాల క్రితం పరిచయమయ్యారు. తర్వాత వారి స్నేహం ప్రేమగా మారింది. 2023 నవంబర్‌లో, అఖిల్ తమ నిశ్చితార్థాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. నా జీవితం నిండిపోయింది. జైనబ్ రవ్జీతో మా నిశ్చితార్థాన్ని ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది అని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. వివాహం అనంతరం నాగార్జున తన ఎక్స్ ఖాతాలో ఫోటోలు షేర్ చేశారు. అమాలా, నేను ఎంతో ఆనందంతో మా కుమారుడు తన ప్రేయసి జైనబ్‌ను పెళ్లాడాడని తెలియజేస్తున్నాం. మా ఇంట్లో తెల్లవారుఝామున 3:35 గంటలకు జరిగిన ఈ ఆత్మీయ వేడుక మనసునిండిన సంతోషంతో నిండిపోయింది. ప్రేమ, నవ్వులు, కుటుంబసభ్యుల మధ్య ఒక కల నిజమైంది. ఇక ఈ వివాహానికి చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటకు ఆశీర్వాదాలు అందించారు. ఇప్పుడు జైనబ్ రవ్జీ అక్కినేని కుటుంబంలో సభ్యురాలిగా మాత్రమే కాకుండా, ఒక విజయవంతమైన కళాకారిణిగా, మరియు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన కూతురిగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు.