Site icon HashtagU Telugu

New Guinea : వింత ఆచారం – కుటుంబంలో ఎవరైనా చనిపోతే వేళ్లు నరికేసుకుంటారు

New Guinea When Someone Die

New Guinea When Someone Die

ప్రపంచం రోజు రోజుకు ఎంతగానో అభివృద్ధి (Development) జరుగుతుంది. ప్రజలు సైతం ఎంతగానో డెవలప్ అవుతున్నారు. కానీ కొంతమంది మాత్రం పురాతనంగా మన పెద్దల దగ్గరి నుండి వస్తున్న ఆచారాలను ,సంప్రదాయాలను మాత్రం వదిలెయ్యకుండా అలాగే పాటిస్తూ వస్తున్నారు. కొన్ని ఆచారాలు , సంప్రదాయాలు చాల కొత్తగా, వింతగా ఉంటాయి. ఇలా కూడా చేస్తారా..ఉంటారా అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. కానీ వారు మాత్రం ఎవరు ఆశ్చర్యపోయిన..నవ్వినా అవేమి పట్టించుకోకుండా సంప్రదాయాలను పాటిస్తుంటారు.

పసిఫిక్ ద్వీప దేశమైన పాపువా న్యూగినియా(Papua New Guinea)లో కూడా గతంలో ఒక విచిత్రమైన ఆచారం ఉండేది. ఈ ఆచారం ప్రకారం.. అక్కడి కొన్ని జాతుల ప్రజలు తమ కుటుంబసభ్యులెవరైనా చనిపోతే సంతాపంగా తమ వేళ్లను (family members cut off their own fingers) నరికేసుకునేవారు. ఇది వారి అనుభవించిన తీవ్ర దుఃఖాన్ని మరియు ఆప్తుల కోల్పోవడం నుండి వచ్చే నష్టాన్ని పుడుస్తుందని వారు భావించేవారు. ఈ ఆచారం ఇప్పటి వారికీ విచిత్రంగా అనిపించచ్చు. కానీ అది అక్కడి పురాతన సంప్రదాయాల నుండి వచ్చినదిగా చెపుతున్నారు. కుటుంబ సభ్యుల మరణం తరువాత వారు తమ శోకాన్ని అలా బయట పెడుతూ, సాంప్రదాయ పరికరాలతో చేతుల వేళ్లను కోసేవారు.

కాలక్రమేణా ఆధునికీకరణ, చట్టపరమైన పరిమితుల కారణంగా ఈ ఆచారం కనుమరుగైపోయింది. ఇప్పుడు, ఈ దుఃఖాన్ని వ్యక్తీకరించే పద్ధతులు మారాయి. న్యాయ పరిమితులు, ప్రభుత్వ నియంత్రణలు ఈ ప్రక్రియను తగ్గించాయి. వాస్తవానికి న్యూగినియాలో ఈ ఆచారం శుద్ధమైన ధర్మాన్ని, నమ్మకాన్ని ప్రదర్శించడం కాకుండా, వారి ప్రామాణిక జీవనశైలిలో ఒక భాగం అయింది. అయితే, ఈ సంప్రదాయం కొంత కాలం తరువాత అందరికీ కష్టంగా మారింది. ఈ ఆచారం కనుమరుగై పోయినప్పటికీ, న్యూగినియా యొక్క వైవిధ్యమైన సంస్కృతిలో ఈ సంఘటనలు ఇప్పటికీ గుర్తుగా నిలుస్తున్నాయి. ఈ విధంగా, గతం నుండి వచ్చిన సాంప్రదాయాలు ప్రస్తుతం చరిత్రగా మారాయి.

Read Also : No Confidence Motion : ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌పై ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం.. ఎందుకు ?

Exit mobile version