Site icon HashtagU Telugu

WhatsApp: సోష‌ల్ మీడియా యాప్స్‌కు ఏమైంది.. ఇప్పుడు వాట్సాప్ వంతు!

WhatsApp

WhatsApp

WhatsApp: సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) శనివారం వేలాది యూజర్లకు డౌన్ అయింది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇది పని చేయడం లేదు. సమాచారం ప్రకారం.. భారతదేశంలో చాలా మంది యూజర్లు మెసేజ్‌లు పంపడంలో, స్టేటస్ అప్‌లోడ్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ఫిర్యాదు చేశారు. అలాగే చాలా మంది యూజర్లు గ్రూప్‌లలో మెసేజ్‌లు వెళ్లకపోవడంపై ఫిర్యాదు చేశారు. డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. శనివారం సాయంత్రం ఏడు గంటల వరకు వాట్సాప్‌కు వ్యతిరేకంగా కనీసం 1000 కంటే ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయి.

వాట్సాప్ డౌన్ అయినట్లు చాలా మంది యూజర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కూడా ఫిర్యాదు చేశారు. చాలా మంది యూజర్లు ఎక్స్‌లో వాట్సాప్ డౌన్ అయిన స్క్రీన్‌షాట్‌లను కూడా షేర్ చేశారు. వీటిలో స్టేటస్ అప్‌లోడ్ పెండింగ్‌లో ఉందని, మెసేజ్‌లు పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. శనివారం సాయంత్రం వాట్సాప్ డౌన్ అవడంపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఒక యూజర్ ప్రశ్నిస్తూ.. “వాట్సాప్ డౌన్ అయిందా?” అని అడిగారు. స్టేటస్ అప్‌లోడ్ చేయడానికి చాలా సమయం పడుతోందని వారు అసహనం వ్యక్తం చేశారు.

Also Read: Shubman Gill: గుజ‌రాత్ కెప్టెన్ శుభ‌మ‌న్ గిల్ ప్ర‌త్యేక రికార్డు.. జీటీ త‌ర‌పున మొద‌టి బ్యాట్స్‌మెన్‌గా చ‌రిత్ర‌!

ఈ సాంకేతిక సమస్యపై వాట్సాప్ నుండి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఇంకా కొంతమంది యూజర్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఈ రెండు యాప్‌లు కూడా మెటా కంపెనీకి చెందినవే. మరొక యూజర్ తాము మెసేజ్‌లు పంపడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మెసేజ్‌లు అటకెక్కి డెలివర్ కావడం లేదని తెలిపారు. ఫిబ్రవరిలో కూడా యూజర్లు ఇలాంటి ఔటేజ్‌ను ఎదుర్కొన్నారు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూజర్లు వాట్సాప్‌ను ఉపయోగించడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అప్పుడు వారు మెసేజ్‌లు పంపడం, వాట్సాప్ వెబ్ ఉపయోగించడం, కాల్స్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ సమయంలో డౌన్‌డిటెక్టర్ 9,000 కంటే ఎక్కువ ఫిర్యాదులను నమోదు చేసింది. ఏప్రిల్ 12న దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యూపీఐ (UPI) ద్వారా చెల్లింపులలో కూడా అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ సమస్యను దాదాపు పూర్తిగా పరిష్కరించారు.