BJP : దక్షిణాదిలో ఒక్క పార్లమెంటు సీటు కూడా తగ్గదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జనాభా గణన చేసిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ ఖరారు చేస్తారని లక్ష్మణ్ తెలిపారు. 2011తో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని, అయినప్పటికీ పార్లమెంటు సీట్లు తగ్గవని ఆయన స్పష్టం చేశారు. మరో వారం, పది రోజుల్లో మన రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పూర్తవుతుందన్నారు. దక్షిణాది వ్యక్తికి జాతీయ అధ్యక్ష పదవి అని ఎక్కడా చర్చ లేదని ఆయన పేర్కొన్నారు.
Read Also: AP Temperature : చంద్రబాబు చెప్పింది ఇది..జగన్ ఇంకా నువ్వు మారవా..?
ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో 153 సీట్లు తెలంగాణలో పెంచాలని పెట్టారని, దక్షిణాది వ్యక్తికి జాతీయ అధ్యక్ష పదవి అని ఎక్కడా చర్చలేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. కులగణన సర్వే సక్రమంగా చేయకపోతే ట్రిపుల్ ఆర్ వెనుకకు వెళ్తుందని, బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తే ఎట్లా?. బీసీల్లో పది శాతం ముస్లింలను కలపకపోతే ఆమోదిస్తాం. కుల గణన తప్పుల తడకగా ఉందన్నారు. 2011తో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. జనాభా తగ్గినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు తగ్గవు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో 153 అసెంబ్లీ సీట్లు తెలంగాణాలో పెంచుకోవచ్చని పొందుపరిచారు అని లక్ష్మణ్ చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. జన గణన చేసిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ ఖరారు చేస్తారు. దక్షిణాదిలో ఒక్క పార్లమెంటు సీటు తగ్గదని ప్రధాని చెప్పారు. బీజేపీ బలం పెరుగుతుందని రేవంత్‌రెడ్డికి భయం పట్టుకుంది. ఆయనే మిగతా నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. సీఎం మార్పు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం. జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది.. ఇప్పటికే రెండు మూడు సమావేశాలు జరిగాయి. కుల గణన చేపట్టి రేవంత్ రెడ్డి ఏ ఒక్కరిని సంతృప్తి పరచలేదు అని లక్ష్మణ్ అన్నారు.
Read Also: State Cabinet : ఈనెల 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం