Nepal Plane Video: నేపాల్ విమానం కూలడానికి ముందు ఏం జరిగిందంటే!

నేపాల్ (Nepal) విమానం క్రాష్ అయిన ఘటన ప్రతిఒక్కరినీ కలిచివేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

  • Written By:
  • Updated On - January 16, 2023 / 12:48 PM IST

నేపాల్ (Nepal) ఖాట్మండ్ విమానాశ్రయంనుంచి బయలు దేరిన విమానం పొఖారాలోని విమానాశ్రయానికి సమీపంలోని సేతి నది ఒడ్డున నియంత్రణ కోల్పోయి క్రాష్ అయిన విషయం తెలిసిందే. కూలిపోవడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి. విమానంలో 68 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. ఖాట్మండ్ త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (Airport) నుంచి ఆదివారం ఉదయం 10.33 గంటలకు విమానం బయల్దేరింది. ఉదయం 11 గంటలకు పర్యటక ప్రాంతమైన పొఖారాకు ఇది చేరుకోవాల్సి ఉంది.

పొఖారాలోని పాత విమానాశ్రయానికి, నూతనంగా నిర్మించిన విమానాశ్రయానికి మధ్య ఈ విమానం కుప్పకూలింది. ఐదుగురు భారతీయులు సహా 72 మందితో వెళ్తున్న ఓ విమానం ల్యాండింగ్​కు ముందు కుప్పకూలింది. ఈ ఘటనలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. కూలిన విమానంలోంచి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తప్పించుకునే పరిస్థితి లేకపోయింది. దీంతో మంటల్లోనే ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రయాణికుల్లో ఇద్దరు పసికందులున్నట్లు సమాచారం. కాలిపోతున్న విమానాన్ని పరిసరగ్రామస్తులు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపకదళాధికారులు మంటలు ఆర్పిన తర్వాత విమాన శకలాలను తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

ఈ (Nepal) ప్రమాదంపట్ల భారత ప్రధానమంద్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.  అయితే ప్రమాదం జరిగే కొద్ది క్షణాల ముందుకు సంబంధించిన వీడియో ఒకటి సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులోని ప్రయాణికుడు సరదాగా జర్నీని అస్వాదిస్తూ విమానం లోపల, బయట ద్రుష్యాలను బంధించాడు. అయితే విమానంలో ల్యాండ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా క్రాష్ కావడం, మంటలు చెలరేగడం వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో (Nepal) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Modi Bridge : సముద్రం మీద మోడీ మార్క్‌ బ్రిడ్జి! దేశానికే త‌ల‌మానికం!