Bank Holidays : వచ్చే నెల మే లో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేస్తాయి తెలుసా? ఈ నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు రానున్నాయి. ప్రతి రెండో, నాలుగో శనివారాలతోపాటు ఆదివారం కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. మే 1న మే డే సందర్భంగా ఆరోజు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. మే 4వ తేదీ ఆదివారం కాబట్టి ఆరోజు ఎలాగూ సెలవు. ఇక మే 9వ తేదీ శుక్రవారం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్‌కత్తాలో బ్యాంకులు బంద్ ఉంటాయి. ఆ మరుసటి రజు మే 10వ తేదీ రెండో శనివారం బ్యాంకులకు సెలవు ఉండనుంది.మే 11వ తేదీ ఆదివారం.
Read Also: Rozgar Mela : త్వరలోనే 51 వేల పోస్టుల భర్తీ : బండి సంజయ్
మే 12వ తేదీ బుద్ధ పూర్ణిమ భోపాల్, జమ్మూ, కోల్‌కత్తా, లక్కో, ముంబై తదితర ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. మే 16 స్టేట్ గ్యాంగ్ టాక్‌లో బ్యాంకులు బంద్. మే 18వ తేదీ ఆదివారం బ్యాంకులు బంద్ ఉంటాయి. ఇది కాకుండా మే 24 ఆదివారం కాబట్టి ఆరోజు బ్యాంకులు బంద్. మే 29వ తేదీ మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఆరోజు సమ్లాలో బ్యాంకులు బంద్ ఉంటాయి. అయితే, బ్యాంకులు బంద్ ఉన్నా కానీ, ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ముందుగానే బ్యాంకులు ఎన్ని రోజులు బంద్ ఉంటాయి తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడతారు. ఈ సమాచారం ఆధారంగా, మే నెలలో బ్యాంక్ సంబంధిత పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
Read Also: Chandrababu : హిందూపురం రేపు రేఖలు మార్చబోతున్న బాలకృష్ణ