Site icon HashtagU Telugu

Pakistan : కశ్మీర్‌ ఉగ్రదాడితో మాకు సంబంధం లేదు: పాకిస్తాన్

We have no connection with Kashmir terror attack: Pakistan

We have no connection with Kashmir terror attack: Pakistan

Pakistan : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఉగ్రదాడి తమ పనేనని పాక్ కు చెందిన ఉగ్రసంస్థ స్పష్టం చేసింది. లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాద శాఖ టెర్రరిస్ట్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రదాడి చేసింది తామేనని మంగళవారమే క్లెయిమ్ చేసింది. ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు పాకిస్తాన్ ప్రభుత్వం పహల్గాంమ్ ఘటనపై స్పందించింది. అనంత్ నాగ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడితో మాకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.

Read Also: AP SSC 10th Results 2025: ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ఫలితాలు విడుద‌ల‌.. రిజ‌ల్ట్స్ చెక్ చేసుకోండిలా!

తమ దేశం అన్ని రకాల ఉగ్రవాదాలను వ్యతిరేకిస్తున్నట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. నాగాలాండ్ నుండి కాశ్మీర్ వరకు, మణిపూర్‌లో అశాంతితో సహా భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో జరుగుతున్నాయి. కనుక ఇది వారి దేశస్తుల పనే.. మాకు దీనితో ఏ సంబంధం లేదని ఆయన నొక్కి చెప్పారు. ఏ రూపంలోనూ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వం. స్థానిక దళాలు భారత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటే, పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం సరికాదని చెప్పారు.

ఇక, ఈ దాడికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులను నిందిస్తూ భారతదేశం వైపు నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వ్యాఖ్య వెలువడినప్పటికీ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ముందుగానే స్పందించడం గమనార్హం. ఈ ఉగ్రదాడితో పాకిస్థాన్ కు ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా ఆదేశంలో పుట్టిందే. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉద్యామాలు, విప్లవాలు జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. డజన్ల కొద్దీ ఉద్యమాలు జరుగుతున్నాయి. నాగాలాండ్ నుంచి కాశ్మీర్ వరకు, దక్షిణాన ఛత్తీస్‌గఢ్‌, మణిపూర్‌ లాంటి ప్రదేశాలన్నింటిలోనూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. అని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు.

Read Also: Surgical Strike : మోడీ సీరియస్.. పాక్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా ?