Site icon HashtagU Telugu

Virender Sehwag: ఆర్తితో వీరేంద్ర సెహ్వాగ్ విడాకులు…?

Virender Sehwag

Virender Sehwag

Virender Sehwag: టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) త్వరలో విడాకులు తీసుకోబోతున్నాడు. తన 20 సంవత్సరాల వివాహం బంధానికి ముగింపు పలకనున్నట్లు జాతీయ మీడియా వార్తలు ప్రచూరిస్తుంది. అంతేకాదు సెహ్వాగ్, ఆర్తీ అహ్లావత్‌ గత కొంత కాలంగా విడివిడిగా నివసిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో అసలు కథ బయటపడింది. దీనికి తోడు సెహ్వాగ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ పంచుకున్నాడు. తాళానికి కత్తెర జోడించిన ఓ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

సెహ్వాగ్, ఆర్తి 2004లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఆర్యవీర్ మరియు వేదాంత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 2007లో ఆర్యవీర్ జన్మించగా 2010లో వేదాంత్ కు జన్మనిచ్చారు. అయితే ఈ 20 ఏళ్ల వివాహ బంధం సాఫీగానే సాగింది. కానీ ఈ మధ్య ఇద్దరి మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. దీంతో వేర్వేరుగా ఉంటున్నారు. దీపావళి వేడుకల సందర్భంగా వీరేంద్ర తన కుమారులు మరియు తల్లితో ఉన్న చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కానీ ఆర్తి ఎక్కడా కనిపించలేదు. రెండు వారాల క్రితం వీరేంద్ర సెహ్వాగ్ పాలక్కాడ్‌లోని విశ్వ నాగయక్షి ఆలయాన్ని సందర్శించాడు. దీనికి సంబందించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌లో ఆర్తి గురించి కూడా ప్రస్తావించలేదు. అయితే అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ ఈ జంట బహిరంగంగా విడిపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఆర్తి వ్యాపారవేత్తగా రాణిస్తుంది.

Also Read: Chepauk: చెపాక్ లోనూ మనదే పైచేయి, ఇంగ్లాండ్ బలహీనత అదే!

వీరేంద్ర సెహ్వాగ్ 2015 లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం అనేక క్రికెట్ లీగ్‌లలో కూడా పాల్గొన్నాడు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ అప్పీళ్ల ప్యానెల్ సభ్యుడిగా కూడా పనిచేశాడు. వీరు భారత్ తరఫున 104 టెస్టులు, 251 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో సెహ్వాగ్ 47.34 సగటుతో 82.34 స్ట్రైక్ రేట్‌తో 8586 పరుగులు చేశాడు. వన్డేలో 35.05 సగటుతో మరియు 104.33 స్ట్రైక్ రేట్‌తో 8273 పరుగులు చేశాడు.