1 Lakh Crores : రియల్ ఎస్టేట్ తైకూన్‌గా ఎదిగిన ఓ మహిళ దాదాపు రూ.లక్ష కోట్లకు పైనే ప్రజల సొమ్మును కాజేసింది. దీంతో వేలాదిమంది బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ తతంగమంతా చేసిన మహిళ పేరు .. ట్రుయాంగ్ మైలాన్!! ఈమె వియత్నాంలోని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ కంపెనీ ‘వాన్ తిన్హ్ పాట్’కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించేది. ట్రుయాంగ్ మైలాన్‌కు స్థానిక సైగాన్ కమర్షియల్ బ్యాంకులోనూ 90శాతం వాటా ఉంది. గత కొన్నేళ్లుగా ఈ బ్యాంకులోనూ ఆమె మోసాలకు పాల్పడ్డారు. నకిలీ లోన్ అప్లికేషన్లు పెట్టి కోట్లాది రూపాయల డబ్బులు తీసుకున్నారు. ఈ లోన్‌లను ట్రుయాంగ్ మైలాన్ తిరిగి చెల్లించకపోవడంతో ఆ బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. హాంకాంగ్‌కు చెందిన ఓ పెద్ద వ్యాపారవేత్తను లాన్ వివాహం చేసుకున్నారు. ట్రుయాంగ్ మైలాన్‌కు చెందిన వాన్ తిన్హ్ కంపెనీకి దేశవ్యాప్తంగా లగ్జరీ హోటళ్లు, అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోనూ ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. ఆమె సంపద విలువ 2022 నాటికి వియత్నాం జీడీపీలో 3శాతం ఉంటుందని అంచనా. ఫలితంగా ఆ బ్యాంకులో డబ్బులు దాచుకున్న దాదాపు 42వేల మందిపై(1 Lakh Crores) ప్రతికూల ప్రభావం పడింది.
We’re now on WhatsApp. Click to Join
916 నకిలీ దరఖాస్తుల ద్వారా..
2018 నుంచి 2022 మధ్యకాలంలో ఆమె ఈవిధంగా 916 నకిలీ దరఖాస్తుల ద్వారా భారీగా లోన్లు తీసుకొని దాదాపు లక్ష కోట్ల రూపాయలకుపైనే డబ్బులు కూడబెట్టుకున్నారు. 2019-22 మధ్య ఆమె డ్రైవర్ బ్యాంకు హెడ్‌క్వార్టర్స్ నుంచి 4.4 బిలియన్ డాలర్ల నగదును ఇంటికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కుంభకోణం 2022లో బయటపడగా.. ఆ ఏడాది అక్టోబరులోనే పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. నాటి నుంచి బ్యాంకు బాండ్ హోల్డర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్బులు విత్‌డ్రా చేసుకోలేకపోవడంతో పాటు కనీసం వడ్డీ కూడా అందుకోవట్లేదు. దీంతో వందలాది మంది బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో లాన్‌తో పాటు 85 మందిపై కేసు నమోదైంది. ఇందులో బ్యాంకు మాజీ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రభుత్వ మాజీ అధికారులు కూడా ఉన్నారట.
Also Read :Oil Free Kichidi : నూనె, నెయ్యి లేకుండా దాల్ ఫ్రీ కిచిడీ.. ఇలా చేయండి..
ఏపీ మహిళ ఘరానా మోసం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌లో బస చేసి.. బిల్లు కట్టే సమయంలో మోసం చేసింది. హోటల్‌లో బిల్లు దాదాపు రూ. 6 లక్షలు కాగా.. యూపీఐ ద్వారా డబ్బులు పంపినట్లు మోసానికి పాల్పడింది. ఇది తెలుసుకున్న హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ మహిళ బ్యాంకు ఖాతాలో కేవలం 41 రూపాయలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. చీటింగ్ కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.