Vegetable 1 Kg 1000 : ఈ కూరగాయ ధర కిలోకు 1000 మాత్రమే

Vegetable 1 Kg 1000 :  కూరగాయల రేటు.. మటన్ కంటే ఎల్లప్పుడూ తక్కువే అని భావించే వాళ్ళు ఒక విషయం  తెలుసుకోవాలి. ఒక కూరగాయ గురించి తెలుసుకోవాలి. 

  • Written By:
  • Publish Date - July 18, 2023 / 03:07 PM IST

Vegetable 1 Kg 1000 :  కూరగాయల రేటు.. మటన్ కంటే ఎల్లప్పుడూ తక్కువే అని భావించే వాళ్ళు ఒక విషయం  తెలుసుకోవాలి. 

ఒక కూరగాయ గురించి తెలుసుకోవాలి. 

 ఆ కూరగాయ రేటు గురించి తెలుసుకోవాలి. 

Also read : Telangana: కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంటులో 15వేల కోట్లు నొక్కేసిన కేసీఆర్: రేవంత్

ఔను.. మీరు ఈ కూరగాయను పరిచయం చేసుకోవాలి. ఎందుకంటే దీని రేటు తెలిశాక మీరు నోరెళ్ళ బెడతారు. దాని పేరు కత్రువా(Katarua). ఫుట్ ఫుట్(Phutphut)  అని కూడా పిలుస్తారు. ఈ కూరగాయ మొక్కలు అడవిలో మాత్రమే కాస్తాయి. ఇవి ఒక రకమైన అడవి పుట్టగొడుగులు. ప్రత్యేకించి ఉత్తర్ ప్రదేశ్ లోని  పిలిభిత్ లో ఉన్న మహోఫ్ అడవిలో, లఖింపూర్ లోని దట్టమైన ఫారెస్ట్ లో కత్రువా లభిస్తుంది. దీని ధర కిలోకు 1000 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా(Vegetable 1 Kg 1000)  పలుకుతోంది. ఎందుకంత ధర అంటే.. టేస్ట్ వల్ల !! దీని రుచి అచ్చం మటన్ లా ఉంటుందని అంటారు.  అందుకే కత్రువాను శాకాహారుల నాన్ వెజ్ అని ఉత్తర్ ప్రదేశ్ లో పిలుస్తుంటారు. మటన్ లాగే ఇందులోనూ ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కత్రువా ధర ఎక్కువగా ఉన్నా.. ఇప్పటికీ ప్రజలు దాన్ని ఎంతో అభిరుచితో కొని తింటారు.

Also read : Telangana High Court: కేసీఆర్ కు షాక్.. బీఆర్ఎస్ కు హైకోర్టు నోటీసులు

కత్రువాతో వంటకాల తయారీ టఫ్.. ఎందుకు ?

కత్రువాతో వంటకాలు తయారుచేయడం చాలా టఫ్. మటన్ కంటే కత్రువా వండటానికే  ఎక్కువ సమయం పడుతుంది. ముందుగా కత్రువాను ముక్కలుగా కట్ చేసి ఉడికించాలి. చికెన్ లేదా మటన్ లాగానే.. కత్రువాకు పసుపు, మిరియాలు, చికెన్ మసాలా, ఉల్లిపాయ పేస్ట్, గరం మసాలా, సుగంధ ద్రవ్యాలను యాడ్ చేయాలి. యూపీలోని షాజహాన్‌పూర్, లఖింపూర్, మైలానీ ప్రాంతాల్లో   దీని సేల్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే, కత్రువాను కోయడానికి పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లోకి అక్రమంగా ప్రవేశించడాన్ని అటవీ శాఖ బ్యాన్ చేసింది. అయినా ఫుడ్ లవర్స్ లో కత్రువాకు ఉన్న క్రేజ్ కారణంగా  ఏటా యూపీ కూరగాయల మార్కెట్లలో దాని సేల్స్ జరుగుతున్నాయి. ఈ బ్యాన్ వల్ల ఎక్కువ రేట్లకు  కత్రువాను అమ్మాల్సి వస్తోంది. ఒకవేళ బ్యాన్ ఎత్తేసి .. అటవీ శాఖ కత్రువాను సేకరించి విక్రయిస్తే దీని రేట్లు తగ్గుతాయని స్థానికులు అంటున్నారు.