Unmarried Youth Protest: మహారాష్ట్రలో పెళ్లికాని ప్రసాద్ లు.. అమ్మాయిల కోసం ధర్నాలు!

అమ్మాయిలు దొరక్కపోవడంతో మహారాష్ట్రలో ఓ జిల్లాకు చెందిన అబ్బాయిలు (Singles) ధర్నాకు దిగారు.

Published By: HashtagU Telugu Desk
batchelors protest

Viral

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి (Marriages) చేసి చూడు.. అని పెద్దలు ఊరకనే అనలేదు. ఇల్లు కట్టడం పక్కన పెడితే, పెళ్లి అనేది మాత్రం పెద్ద టాస్క్ గా మారుతోంది ఈ తరం యువతకు. పర్సనల్ లైఫ్, ఉద్యోగాల పేరుతో చాలామంది పెళ్లి (Marriage)ని వాయిదా వేస్తూంటే, మరికొందరు పెళ్లి కోసం ఏకంగా కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. ఇంకొందరు ఏకంగా ధర్నాలు సైతం చేస్తున్నారు. పెళ్లి కోసం ధర్నాలు కూడా చేస్తున్నారా? అని అనుకుంటున్నారా.. అయితే మహారాష్ట్ర కు చెందిన బ్యాచిలర్ బాబుల (Unmarried Youth) గురించి తెలుసుకుంటే ‘అయ్యో పాపం’ అని జాలి చూపుతారు.

మహారాష్ట్రలోని శోలాపుర్‌ (Sholapur) జిల్లాలో పెళ్లి కాని యువకులు వింత నిరసన చేపట్టారు. వివాహాలు చేసుకోటానికి రాష్ట్రంలో తగిన సంఖ్యలో అమ్మాయిలు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. క్రాంతి జ్యోతి పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనకు పెళ్లి కాని యువకులు (Unmarried Youth) పెద్దసంఖ్యలో హాజరయ్యారు. గుర్రాలపై ఊరేగింపుగా వచ్చి శోలాపుర్‌ కలెక్టరేటు ఎదుట బైఠాయించారు (Protest). మహారాష్ట్రలో లింగ నిష్పత్తి సమానంగా లేకపోవడానికి లింగ నిర్ధరణ చట్టం పటిష్ఠంగా అమలు కాకపోవటమే కారణమని వీరు (Unmarried Youth) ఆరోపించారు.

Also Read: KTR: కేంద్రంపై మరో పోరుకు సిద్ధమైన కేటీఆర్!

  Last Updated: 22 Dec 2022, 01:04 PM IST