Encounter : కథువాలో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు ఉగ్రవాదులు హతం

Two terrorists killed in the encounter : కథువాలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల ఆపరేషన్ కొనసాగుతున్నట్టు 'రైజింగ్ స్టార్ కార్ప్స్' సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది.

Published By: HashtagU Telugu Desk
Terror Attack In J&K

Terror Attack In J&K

Two terrorists killed in the encounter : భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జమ్మూకశ్మీర్‌లోని కథువాలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల ఆపరేషన్ కొనసాగుతున్నట్టు ‘రైజింగ్ స్టార్ కార్ప్స్’ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తెలిపింది. నిర్దిష్టమైన సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని, కథువా-బసంత్‌గఢ్ సరిహ్దదు ప్రాంతంలో బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని డిఫెన్స్ పబ్లిక్స్ రిలేషన్స్ అధికారి ఒకరు తెలిపారు.

Read Also: AP Govt : ఏపీ ఎక్సైజ్‌ శాఖలో ‘సెబ్‌’ రద్దు..డీజీపీ ఉత్తర్వులు

భద్రతా బలగాల కాల్పుల్లో హతులైన ఇద్దరు ఉగ్రవాదులను పాక్ పౌరులుగా గుర్తించామని, వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, తినుబండారాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వీటిలో మోడ్రన్ రైఫిల్స్, గ్రనేడ్లు, ఇతర మారణాయుధాలు ఉన్నట్టు అధికారులు చెప్పారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్టు తెలిపారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఈనెల 18 నుంచి మూడు దశల్లో ఎన్నికలు జరుపుతున్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ భద్రతా బలగాలు అప్రమత్తమవుతూ ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.

మరోవైపు ఈ తెల్లవారుజామున జమ్మూ కశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో పాక్ బలగాలు అకారణంగా జరిపిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం (BSF) సైనికుడు గాయపడ్డాడు. సైనికులు అప్రమత్తంగా ఉన్నారని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో కాపలా కాస్తున్న బీఎస్ఎఫ్ పేర్కొంది. ఈ సరిహద్దు సుమారు 3,323 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నది.

Read Also:   Rahul Gandhi Sikh Controversy: రాహుల్ గాంధీ నివాసం ఎదుట బీజేపీ ఆందోళనలు

 

 

  Last Updated: 11 Sep 2024, 07:10 PM IST