Delhi Metro: ఢిల్లీ మెట్రోలో అమ్మాయిల పోల్ డాన్స్.. చక్కర్లు కొడుతున్న వీడియో

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అంటేనే ఓ పద్దతిగా ప్రయాణం సాగుతుంటుంది. కానీ ఢిల్లీ మెట్రోలో మాత్రం చిత్రవిచిత్ర ఘటనలు జరుగుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Delhi Metro

Delhi Metro

మెట్రో ట్రైన్ అనగానే ఏం గుర్తుకువస్తోంది. ఒకప్రాంతం నుంచి మరోక ప్రాంతానికి ప్రయాణికులను తమ తమ స్థానాలకు చేరేవేసే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అంటేనే ఓ పద్దతిగా ప్రయాణం సాగుతుంటుంది. ఇక సినిమాలో చూసినట్టుగా ప్రయాణికులు బిజిబిజీగా ఉంటూ తమ సీట్లలో కూర్చొని ఫోన్స్ తో కాలక్షేపం చేస్తుంటారు. కానీ ఢిల్లీ మెట్రో మాత్రం ఇందుకు విరుద్ధం.

ఢిల్లీ మెట్రో రైలులో ఇద్దరు మహిళలు ‘పోల్ డ్యాన్స్’ చేసిన వీడియో సోషల్ మీడియాలోని చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న అమ్మాయిలు, అబ్బాయిలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. గతంలో ఓ జంట మెట్రో ట్రైన్ లోనే పొర్న్ చేసుకోవడం, మరో జంట ముద్దాడుకోవడం లాంటివి చర్యలకు దిగాయి.. ఆ తర్వాత తాజాగా అమ్మాయిలు పోల్ డాన్స్ చేయడంతో మరోసారి ఢిల్లీ మెట్రో వార్తల్లోకి ఎక్కింది.

@HasnaZarooriHai అనే వినియోగదారు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో, పర్వీన్ బాబీ మరియు శశి కపూర్‌లు నటించిన ‘సుహాగ్’ చిత్రంలోని ‘మెయిన్ టు బేఘర్ హూన్’ పాటకు స్టెప్పులు వేస్తారు.  వీడియోలో ఒక మహిళ కూర్చొని స్తంభానికి వేలాడుతూ ఉండగా, మరొకరు ఆమె చుట్టూ తిరుగుతున్నారు. వీరిద్దరి ఆచూకీ, గుర్తింపులు తెలియరాలేదు. ఈ వీడియో గురువారం ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయబడింది. అప్పటి నుండి 303,000 వీక్షణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండటంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. వామ్మో ఢిల్లీ మెట్రో.. మొన్న లవర్స్ పోర్న్, నిన్న ముద్దులాటలు.. నేడు పోల్ డాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా అమ్మాయి పోల్ డాన్స్ చూసి ఢిల్లీ మెట్రోలో ఏం జరుగుతుందో చూడండి.

https://twitter.com/HasnaZarooriHai/status/1676871173769142272

Also Read: Tana Maha Sabalu: అంగరంగ వైభవంగా తానా సభలు, బాలయ్యతో పాటు ప్రముఖుల సందడి

  Last Updated: 08 Jul 2023, 01:13 PM IST