Heat Stroke Vs Chutney : వడదెబ్బకు చెక్ పెట్టే చట్నీ

Heat Stroke Vs Chutney : వేసవి కాలంలో మనం కూల్ డ్రింక్స్ , నీటిని తాగుతుంటాం.

  • Written By:
  • Updated On - May 27, 2023 / 11:26 AM IST

Heat Stroke Vs Chutney : వేసవి కాలంలో మనం కూల్ డ్రింక్స్ , నీటిని తాగుతుంటాం. తేలికపాటి ఫుడ్ తింటాం. అయినా వడదెబ్బ, జీర్ణ సమస్యలు, ఎసిడిటీ వంటివి ఎదురవుతుంటాయి. వీటిని నివారించాలని అనుకుంటే.. మీ వంటగదిలోనే ఒక పరిష్కార మార్గాన్ని సిద్ధం చేసుకోవచ్చు. అదే.. పచ్చి మామిడి చట్నీ(Heat Stroke Vs Chutney). ఇది జీర్ణశయాలలోని  పేగుల పనితీరును బెటర్ చేస్తుంది. దీని కారణంగా కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ (జీర్ణ ఎంజైమ్‌లు) మన శరీరంలోకి విడుదలవుతాయి.  ఇవి మన జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేసుకునేందుకు.. వడదెబ్బ తగలకుండా రక్షణ పొందేందుకు పచ్చి మామిడి చట్నీహెల్ప్ చేస్తుంది.

Also read : Raw Mangoes: వేసవిలో పచ్చి మామిడి పండ్లను తినడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు

పచ్చి మామిడి చట్నీ తయారీ పద్ధతి

  • గ్యాస్ మీద కడాయి ఉంచండి.. అందులో నెయ్యి వేసి కరిగించాలి.
  • నెయ్యి వేడి అయ్యాక.. అందులో జీలకర్ర వేసి వేయించాలి.
  • పిక్కతో సహా తరిగిన పచ్చి మామిడిని అందులో వేయాలి.
  • అందులో ఉప్పు వేయాలి. తర్వాత నీళ్లు పోసి ఉడికించాలి.
  • దానికి బెల్లం ముక్క వేసి బాగా కలపాలి.
  • పచ్చి మామిడికాయను పూర్తిగా ఉడికించాలి.  లేకపోతే తినడానికి వీలుగా ఉండదు.
  • ఇక మీ పచ్చి మామిడి చట్నీ రెడీ అయినట్టే.
  • ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
  • ఈ చట్నీ రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.