విమాన ప్రయాణం (Air Travel) అంటేనే ప్రయాణికులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ విమానం కూలిపోతుందో తెలియడం లేదు. మొన్నటికి మొన్న అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం (Ahmedabad Air India Plane Crash) ఇళ్ల మధ్యలో కూలిపిన ఘటన లో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు ఇళ్ల లో ఉన్న స్థానికులు సైతం చనిపోయారు. దాదాపు 274 మందికి పైగా ఈ ప్రమాదంలో మరణించడం దేశ వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటన జరిగిన రెండు రోజుల్లోనే ఉత్తరాఖండ్ లో హెలికాఫ్టర్ కూలిన ఘటన లో పలువురు చనిపోయారు. ఇలా వరుస విమాన ప్రమాదాలు అందర్నీ భయాందోళకు గురి చేస్తున్నాయి.
గత 24 గంటల్లోనే పది కంటే ఎక్కువ విమానాలు సాంకేతిక లోపాలతో వార్తల్లోకి వచ్చాయి. ఏసీ లు పనిచేయకపోవడం, ఇంజిన్‌లో పొగలు రావడం, టెక్నికల్ ఇష్యూస్ వల్ల విమానాలు గమ్యానికి చేరకపోవడం వంటి ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశీయమైనవే కాకుండా అంతర్జాతీయ విమానాల్లోనూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎయిరిండియా, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి ప్రముఖ విమాన సంస్థల్లో సాంకేతిక లోపాలు నమోదవుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానాన్ని తిరిగి ల్యాండ్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ప్రయాణికులకు ఆందోళన కలిగించే ఘటనలు తరచూ జరుగుతుండటంతో, విమాన ప్రయాణం సాధారణంగా మారటం కంటే భయంగా మారుతోంది.
Annadata Sukhibhava : అన్నదాతా సుఖీభవ రైతులకు గుడ్ న్యూస్
ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా విమానయాన సంస్థలు ప్రయాణికుల భద్రతపై మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి సాంకేతిక లోపానికి కారణాన్ని విశ్లేషించి, సమర్థవంతమైన నివారణ చర్యలు తీసుకోవాలి. ప్రయాణికులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించడమే కాక, అప్రమత్తంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. లేనిచో విమానయాన రంగంపై ప్రజల్లో అవిశ్వాసం పెరిగి, ప్రయాణాల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది.