బెంగళూరులో జరిగిన తాజా తొక్కిసలాట (Bengaluru Stampede) ఘటనపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఘటన లో 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో ప్రజల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా “పుష్ప-2” (Pushpa 2 ) ప్రీ రిలీజ్ సమయంలో హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసిలాట (Sandhya Theater Stampede) లో ఓ మహిళా మృతి చెందినప్పుడు హీరో అల్లు అర్జున్ను (Allu Arjun Arrest) పోలీస్‌లు అరెస్టు చేయడం ఇప్పుడు తిరిగి చర్చకు వస్తోంది. అప్పట్లో ఒకరు చనిపోతే ఓ సినీ నటుడిని బాధ్యుడిగా చూడగలిగిన అధికారులు, ఇప్పుడు 11 మంది మరణించినా నిజమైన బాధ్యులను అరెస్ట్ చేస్తారా? అన్న సందేహాన్ని వారు పెంచుతున్నారు.
Nails Changing Color : మీ గోళ్ల రంగు మారుతోందా..? అయితే మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే..!!
ఈ విమర్శల నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రభుత్వ ప్రమేయం ఉన్న కార్యక్రమం అయితే, తగిన భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారు? అభిమానులను ఆహ్వానించేటప్పుడు మౌలిక సదుపాయాలపై దృష్టి ఎందుకు పెట్టలేదు? ఈ తొక్కిసలాట కు కారణమైన నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది? న్యాయం సమానంగా ఉండాలంటే, అల్లు అర్జున్ విషయంలో తీసుకున్న చర్యలను పోల్చుకుంటే ఇప్పుడు పాలకుల నిర్వాహక నైపుణ్యంపై ప్రశ్నలు రావడం సహజం. నెటిజన్లు ప్రశ్నించే హక్కు వినిపించడం కూడా ప్రజాస్వామ్యంలో ఒక మంచి సంకేతం.
Virat Kohli: నాకు మాటలు రావడం లేదు.. తొక్కిసలాట ఘటనపై విరాట్ కోహ్లీ విచారం!
ఇకపై ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అంటే ప్రభుత్వ స్థాయిలో కఠిన చర్యలు తప్పవు. ప్రతి బహిరంగ కార్యక్రమానికి గరిష్ఠ భద్రతా ప్రణాళికలు ఉండాల్సిన అవసరం ఉంది. సాంకేతిక పరికరాలతో, ట్రాఫిక్ నియంత్రణతో, ప్రజలను నియంత్రించే ప్రత్యేక విధానాలతో ముందస్తు ప్రణాళికలు ఉండాలి. ఒకవేళ తప్పిదం జరిగితే, బాధ్యులను గుర్తించి శిక్షించడం ద్వారా మాత్రమే ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుంది. చూద్దాం ఏంజరుగుతుందో..!!