Site icon HashtagU Telugu

Child Death: లంచం డిమాండ్ చేసిన డాక్టర్.. తల్లి కడుపులోనే బిడ్డ మృతి!

పేదలకు (Poor), మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులు మాత్రమే దిక్కు. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోలేరు. కాసుల పేరుతో, లంచాల (Bribe) పేరుతో ప్రభుత్వ డాక్టర్లు రోగుల పట్ల నిర్లక్ష్యం గా వహిస్తున్నారు. కేవలం లంచం ఇవ్వలేదని ఆపరేషన్ చేయకపోవడంతో తల్లి (Mother) కడుపులోని బిడ్డ చనిపోయింది. ఈ దారుణ ఘటన కర్ణాటక యాద్గిర్ జిల్లాలో జరిగింది.

వివరాల ప్రకారం.. రూ.10,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో, రోగి బంధువులు డబ్బులు (Bribe) ఇవ్వకపోడంతో సి-సెక్షన్ సర్జరీ చేసేందుకు ఓ వైద్యుడు నిరాకరించాడు. దీంతో బిడ్డ తల్లి కడుపులోనే మృతి చెందింది. ఈ ఘటనలో జిల్లా యంత్రాంగం గైనకాలజిస్ట్ డాక్టర్ పల్లవి పూజారిని శుక్రవారం సస్పెండ్ చేసింది.

స్థానిక మహిళ సంగీత ప్రసవం కోసం గురువారం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. తనకు సిజేరియన్ సర్జరీ చేయించేందుకు డాక్టర్ పల్లవి రూ.10వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత సుజాత కుటుంబీకులు బంధువులు, స్నేహితుల వద్ద డబ్బులు (Bribe) సమకూర్చేందుకు వెళ్లారు. డబ్బులు ఇచ్చిన తర్వాతే ఆపరేషన్ చేశాడు. అయితే ప్రసవం ఆలస్యం కావడంతో కడుపులోనే బిడ్డ మృతి చెందింది. గైనకాలజిస్ట్ నిర్లక్ష్యమే చిన్నారి మృతికి కారణమని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో నిరసన తెలిపారు.

Also Read: CM KCR: సికింద్రాబాద్ మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా!

Exit mobile version