ప్రతి సంవత్సరం మార్చి 8 వస్తుందంటే మహిళా దినోత్సవం గురించి గొప్ప గొప్ప ప్రసంగాలు వినిపిస్తాయి. మహిళల హక్కులు, సమానత్వం, స్వాతంత్ర్యం గురించి మాట్లాడతారు. కానీ వాస్తవానికి సమాజంలో మహిళలకు నిజమైన స్వేచ్ఛ, హక్కులు కల్పించబడుతున్నాయా? వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభిస్తున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ స్పష్టంగా లేనే లేదు. పురుషులతో సమానంగా మహిళలు పోటీకి రావాలంటే, ప్రోత్సాహం మాత్రమే కాదు, సరైన వాతావరణం కూడా అవసరం.
భారత రాజ్యాంగం మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించినా, రాజకీయాల్లో మహిళలు ఎంతవరకు ఎదిగారు? పార్లమెంట్‌లో, శాసనసభల్లో, స్థానిక సంస్థల్లో కొన్ని సీట్లు మహిళలకు రిజర్వ్ చేసినా, మంత్రులుగా అవతరించినవారు ఎంతమంది? ఇంకా మహిళలు అధిక సంఖ్యలో పాలనలోకి రాకపోవడం వెనుక, వారికి సరిగ్గా అవకాశాలు ఇవ్వని పరిస్థితి ఒక ప్రధాన కారణం. నాయుకత్వానికి, నాయకత్వానికి జెండా పట్టే సమర్థతకీ లింగ భేదం ఉండకూడదు. కానీ ఇప్పటికీ మహిళలు రాజకీయాల్లో పురుషాధిక్యతను ఎదుర్కొంటూనే ఉన్నారు.
Chhaava Effect : గుప్తనిధుల కోసం పోటీపడ్డ గ్రామస్థులు
ప్రైవేట్ రంగంలో కూడా పరిస్థితి మెరుగుపడలేదు. కార్పొరేట్ కంపెనీలలో టాప్ పొజిషన్లలో మహిళలు శాతం తక్కువగానే ఉన్నారు. సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్, మెడికల్, మీడియా వంటి రంగాల్లో పని చేసే మహిళల సంఖ్య పెరుగుతున్నా, వారిని పైస్థాయిలోకి తీసుకెళ్లే విధానాలు ఇంకా పూర్తిగా అమలు కావడం లేదు. మహిళలు సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ, వారికి సరైన అవకాశాలు లేకపోవడం బాధాకరం.
మహిళలకు వారి హక్కులు పూర్తిగా లభించినప్పుడు. వారి ప్రతిభను గుర్తించి, వారికి సమాన అవకాశాలు కల్పించినప్పుడు నిజమైన ఉమెన్స్ డే జరుపుకోవచ్చు. మహిళల సాధికారత ఒక్క రోజు జయంతి లాంటి అంశంగా మారకూడదు. ప్రతిరోజూ మహిళలకు గౌరవం, సమానత్వం లభించే పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అప్పుడే మహిళా దినోత్సవం నిజమైన అర్ధాన్ని సంతరించుకుంటుంది!
Vyjayanthimala : వైజయంతిమాల ఆరోగ్యంపై వదంతులు.. విఖ్యాత నటీమణి జీవిత విశేషాలివీ