Site icon HashtagU Telugu

Lasya Nanditha: లాస్య నందిత ఘటన..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

 

Ponnam Prabhakar: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ యువ నేత లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీల డ్రైవర్లందరికీ ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.  ప్రజాప్రతినిధుల రక్షణ ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు.. ప్రజాప్రతినిధుల దగ్గర ప్రస్తుతం డ్రైవర్లుగా పని చేస్తున్న వారికి ఫిట్ నెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వం దీన్ని సుమోటోగా తీసుకుందని తెలిపారు. మొత్తం 33 జిల్లాల్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రముఖుల డ్రైవర్లకు ఫిట్ నెస్ టెస్టులు నిర్వహిస్తారని వివరించారు. డ్రైవింగ్ నైపుణ్యం లేని వారిని విధుల్లో పెట్టుకోవద్దని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ నేతలకు పొన్నం ప్రభాకర్ సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత.. ఊహించని రీతిలో కారు ప్రమాదానికి గురై మరణించటం అందరినీ దిగ్భ్రాంతికి గురు చేసింది. అందులోనూ.. తన తండ్రి సాయన్న మరణించిన సరిగ్గా ఏడాదికే ఆమె కూడా ప్రాణాలు వదలటం మరింత కలిచివేసే అంశం. అయితే.. ఈ ప్రమాదానికి కారణం.. డ్రైవర్ నిర్లక్షంగా కారు నడపటం, అతివేగమేనని పోలీసులు నిర్ధారించారు. కాగా.. లాస్య నందిత ఎమ్మెల్యే అయిన తర్వాత.. ఇది రెండో కారు ప్రమాదం. అయితే.. నిన్న జరిగిన ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఆకాశే.. మొన్న నల్గొండ సభ నుంచి వస్తున్న సమయంలోనూ కారు నడిపించాడు. ఆ రోజు కూడా ఓ వాహనాన్ని తప్పించబోయి.. యాక్సిండెంట్ చేశాడు. ఈ ప్రమాదంలోనూ ఓ వ్యక్తి మరణించినట్టు సమాచారం.

read also :  SSC New Website : అభ్యర్థులూ SSC వెబ్‌సైట్ మారింది.. అది చేసుకోండి

Exit mobile version