భారతదేశం (India) భిన్నమైన సంస్కృతులు, భాషలు కలిసిన ప్రదేశం. అయితే కొన్ని సందర్భాల్లో భాషాపరమైన విభేదాలు తెలెత్తుతుంటాయి. ఉత్తరాదికి దక్షిణాది భాషలు, దక్షిణాదికి ఉత్తరాది భాషలు సులభంగా అర్థంకావు. అయినప్పటికీ సోదరభావంతో దేశంలోని ప్రజలు ఒకటిగా జీవిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్(UP)లో తెలుగు భాషలో సైన్‌బోర్డులు (Telugu Boards) ఏర్పాటు చేయడం ఈ ఐక్యతకు నిదర్శనంగా మారింది. సాధారణంగా హిందీ ఆధిపత్యం గల యూపీలో ప్రాంతీయ భాషల ప్రాముఖ్యత తక్కువగా కనిపించేదైనా, మహాకుంభమేళా (Maha Kumbh Mela) సమయంలో యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) ప్రభుత్వం తెలుగు సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకుంది.
Ibrahim Zadran: ఛాంపియన్స్ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్!
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్, వారణాసి, కేదార్‌నాథ్ వంటి పవిత్ర స్థలాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. అందులో చాలా మంది తెలుగు భక్తులు కూడా ఉన్నారు. అయితే హిందీ లేదా ఇంగ్లీష్ చదవలేని భక్తులు దారి తెలియక ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. ఈ సమస్యను పరిష్కరించేందుకు యోగి సర్కారు ప్రత్యేక భాషా సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది. ఇతర భాషల్లో సూచనలు ఉంటే భక్తులకు మరింత సౌలభ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహాకుంభమేళాలో తెలుగు భక్తులు తెలుగు భాషలో సూచిక బోర్డులను చూసి ఆనందించడం, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం దీనికి ఉదాహరణ.
Truth Bomb : ట్రూత్ బాంబ్.. వీడియో రిలీజ్ చేసిన వైసీపీ
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ బోర్డులు, భాష ఏదైనా – భారతీయులంతా ఒక్కటే అనే సందేశాన్ని ప్రసారం చేస్తున్నాయి. భిన్నమైన భాషలు, సంస్కృతులు కలిసిన దేశంలో ఇలాంటి చర్యలు అన్ని ప్రాంతాల ప్రజల మధ్య ఐక్యతను పెంచుతాయి. కేవలం హిందీ, ఇంగ్లీష్ మాత్రమే కాదు, ఇతర ప్రాంతీయ భాషలకూ ప్రాముఖ్యత ఇచ్చే విధంగా యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.