Group-3 Exams : తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల

Group-3 Exams : మధ్యాహ్నం మూడు గంటల నుంచి 5:30 వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది. 18న తేదీన పేపర్-3 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగునుంది. కాగా పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను నవంబర్ 10వ తేదీ నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది టీజీపీఎస్సీ అవకాశం కల్పించింది.

Published By: HashtagU Telugu Desk
Telangana Group-3 Exam Schedule Released

Telangana Group-3 Exam Schedule Released

Group-3 Schedule : తెలంగాణలో నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నారు. 17న రెండు సెషన్లలో రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది. 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌లో ఫస్ట్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు.

మధ్యాహ్నం మూడు గంటల నుంచి 5:30 వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది. 18న తేదీన పేపర్-3 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగునుంది. కాగా పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను నవంబర్ 10వ తేదీ నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది టీజీపీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ Group-3పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యి తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఇదిలా ఉంటే 1,388 పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Read Also: Security for Sharmila : షర్మిలకు భద్రతను పెంచాలని డీజీపీని కోరిన కాంగ్రెస్

  Last Updated: 30 Oct 2024, 06:05 PM IST