Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 23 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణనపై స్పీకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ లు, సీఎస్, డీజీపీ, అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం రైతు భరోసా విధివిధానాల ఖరారు కోసం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం జిల్లాలో పర్యటిస్తోంది. ఈ కమిటీ సేకరించిన వివరాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే పూర్తి స్థాయి బడ్జెట్‌ను కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే జాబ్ క్యాలెండర్ ను సైతం ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. గతంలో అసెంబ్లీ సమావేశాలు హాజరు కానీ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ సమావేశాలకు తాను తప్పకుండా హాజరవుతానని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సమావేశాలు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే ఆసక్తి నెలకొంది.
కాగా, శాసనసభ, మండలి సమావేశాలకు నోటీఫికేషన్ జారీ అయింది. ఈ నెల 23 నుండి శాసనసభ, 24 నుండి శాసనమండలి సమావేశాలు ప్రారంభ కానున్నాయి. 25 లేదా 26వ తేదీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. పది రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పది రోజుల్లో రైతు భరోసా, కొత్త ఆర్ఓఆర్ చట్టం, తెలంగాణ లోగో మార్పు, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో పాటు పలు బిల్లులపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆయా శాఖల అధికారులతో వరుసగా చర్చలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏయే శాఖలకు కేటాయింపులు ఎలా జరపాలనే అంశంపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు అధికారులు.
Read Also: Trump : ట్రంప్‌పై కాల్పుల కేసులో కీలక ఆధారం.. సోష
ల్ మీడియాలో ‘క్రూక్స్’ పోస్ట్