Site icon HashtagU Telugu

Tamil Nadu : రూపాయి సింబ‌ల్‌ను మార్చేసిన త‌మిళ‌నాడు స‌ర్కారు

Tamil Nadu government changes the rupee symbol

Tamil Nadu government changes the rupee symbol

Tamil Nadu :  గత కొన్ని రోజులుగా త‌మిళ‌నాడు ప్రభుత్వం, కేంద్రం మ‌ధ్య హిందీ భాషా అంశంపై ఘ‌ర్ష‌ణ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. రాష్ట్ర బ‌డ్జెట్ లోగోలో భారీ మార్పు చేసింది. బ‌డ్జెట్ లోగోలో ఉండే రూపాయి గుర్తు స్థానంలో త‌మిళ సింబ‌ల్‌ను చేర్చింది. తమిళనాడులో రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చారు. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లైంది. తమిళ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకొనేందుకు తీసుకొన్న చర్యగా అభివర్ణించాయి. అయితే మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషను సబ్జెక్టుగా చేర్చడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Read Also: Electricity sector : కరెంట్‌ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశాం: సీఎం చంద్రబాబు

ఇక, సింబ‌ల్‌ను మార్చిన అంశంపై ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ‌నాడు ప్రభుత్వం ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కానీ స్టాలిన్ స‌ర్కారు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని బీజేపీ ఆరోపించింది. యావ‌త్ దేశానికి రూపాయి సింబ‌ల్ కామ‌న్‌గా ఉంటుంద‌ని నారాయ‌న‌ణ్ తిరుప‌తి పేర్కొన్నారు. లోగోలో పెట్టిన కొత్త సింబ‌ల్‌.. త‌మిళ అక్ష‌రం రూ. రూపాయి అని పిలిచే ప‌దంలో ఆ అక్ష‌రం మొద‌లు వ‌స్తుంది. కాగా, హిందీ భాషపై ఇప్పటికే సీఎం స్టాలిన్‌ దీనిపై స్పందించారు. తమిళనాడు విద్యార్థులు మూడో భాషను నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ కొందరు మమ్మల్ని అడుగుతున్నారు. కానీ, ఉత్తరాదిలో మూడో భాష కింద ఏ భాషను నేర్పుతున్నారో చెప్పడం లేదు. అక్కడ రెండు భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం మూడు భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు.

ఎన్‌ఈపీ మార్గదర్శకాలు అమలు పరిస్తేనే కేంద్రం తన వాటా నిధులు అందిస్తుందని విధాన నిబంధనలు చెబుతున్నాయి. జాతీయ విద్యావిధానంలోని కీలక అంశాలను, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి నిరాకరించిన కారణంగా కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) కింద అందించాల్సిన రూ.573 కోట్లను నిలిపేసింది. విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలని ఎన్‌ఈపీ-2020 సిఫార్సు చేస్తోంది. ఇందులో కచ్చితంగా రెండు భారతీయ భాషలుండాలి. ఈ ఫార్ములా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నింటికీ వర్తిస్తుంది. అయితే విద్యార్థులకు నేర్పాల్సిన భాషలేమిటన్నది నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలదే అన్నారు.

Read Also: Pranitha : తల్లైన ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న బాపు బొమ్మ