Worlds Tallest Tree : ఆ చెట్టు ఎత్తు ఎంతో చెబితే.. మీరు ఆశ్చర్యపోతారు!!
అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఇది హైట్ లో పెద్దది.
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ హైట్ 305 అడుగులు.
కానీ ఈ చెట్టు హైట్ 335 అడుగులు అని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్ పరిధిలోని బోమ్ కౌంటీలో నైంగ్‌చి సిటీ ఉంది. దీని శివార్లలో యార్లంగ్ జాంగ్‌బో గ్రాండ్ కాన్యన్ నేచర్ రిజర్వ్ ఉంది. ఇందులో యార్లంగ్ త్సాంగ్పో గ్రాండ్ కాన్యన్ అనే పేరుతో ప్రపంచంలోనే అత్యంత లోతైన లోయ ఉంది. ఈ లోయలోని మొక్కలపై రీసెర్చ్ చేసేందుకు వెళ్లిన పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 335 అడుగుల చెట్టును గుర్తించారు. ఇది ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తైన చెట్టు(Worlds Tallest Tree) అని వెల్లడించారు. ఈ చెట్టు ఫుట్‌బాల్ సాకర్ పిచ్ అంత పొడవుగా ఉంటుందని తెలిపారు. ఈ చెట్టు హిమాలయన్ సైప్రస్ లేదా టిబెటన్ సైప్రస్ జాతికి చెందిందని చెప్పారు.
Also read : CCTV Video: పట్టపగలు నడీ రోడ్డుపై తుపాకీ గురిపెట్టి చోరీ: వైరల్ వీడియో
ఎందుకింత హైట్ పెరిగింది ?
యార్లంగ్ త్సాంగ్పో గ్రాండ్ కాన్యన్ లోయలో 50 చెట్లు 279 అడుగుల కంటే ఎక్కువ హైట్ తో.. 25 చెట్లు 295 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుతో ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆ లోయలో ఉన్న వాతావరణ పరిస్థితుల వల్లే ఈ చెట్టు ఇంతగా 335 అడుగుల ఎత్తు, 9.6 అడుగుల వ్యాసం మేర పెరిగిందని వివరించారు. ఈ చెట్టు 3D నమూనాను శాస్త్రవేత్తలు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆసియా ఖండంలోనే అతి ఎత్తైన చెట్టు ఇదేనని స్పష్టం చేశారు. ఇంతకుముందు వరకు మలేషియాకు చెందిన ఎల్లో మెరంటీ చెట్టు ఆసియా ఖండంలో అత్యంత ఎత్తైన చెట్టుగా ఉండేదని చెప్పారు.
Also read : Uppal Skywalk: హైదరాబాద్ లో మరో అద్భుతం, నేడు ఉప్పల్ స్కైవాక్ ప్రారంభం
ప్రపంచంలోనే ఎత్తైన చెట్టు ఎక్కడుంది ?
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టు ఎక్కడుందో తెలుసా ? అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. దానిపేరు హైపెరియన్. ఈ చెట్టు ఎత్తు 380 అడుగులు. ఇది రెడ్‌వుడ్ జాతికి చెందిన చెట్టు . 2006 సంవత్సరంలో దీన్ని గుర్తించారు.