Ayodhya’s Ram Mandir : అయోధ్య ఆలయంపై దాడికి పాకిస్థాన్ కుట్ర

Ayodhya's Ram Mandir : కేంద్ర నిఘా సంస్థల సమాచారంతో ఫరీదాబాద్ ఎస్టీఎఫ్ (STF) సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు

Published By: HashtagU Telugu Desk
Isi Backed Plot To Attack A

Isi Backed Plot To Attack A

పవిత్రమైన అయోధ్య రామమందిరం(Ayodhya’s Ram Mandir)పై దాడికి పాకిస్థాన్ ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తుంది. గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం (Gujarat Anti-Terrorism Squad (ATS)) ఈ దాడిని గుర్తించి, హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాదిని అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్‌లో రెండు హ్యాండ్ గ్రనేడ్లు, మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర నిఘా సంస్థల సమాచారంతో ఫరీదాబాద్ ఎస్టీఎఫ్ (STF) సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. దాడికి పన్నిన కుట్రలో అయోధ్య రామమందిరం లక్ష్యంగా ఉండటం భద్రతా దళాలను అప్రమత్తం చేసింది.

Fact Check : రంజాన్ మాసం వేళ.. పుచ్చకాయల్లోకి రసాయనాలు.. వీడియో వైరల్

అరెస్టైన ఉగ్రవాదిని ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కు చెందిన 19 ఏళ్ల అబ్దుల్ రెహమాన్‌(Abdul Rahman)గా గుర్తించారు. అతడు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్షంగా సంబంధాలు కొనసాగిస్తూ, రామమందిరం పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నిఘా సంస్థల సమాచారం మేరకు.. అతడు పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ (Pakistan’s Inter-Services Intelligence (ISI) సహా ఇతర ఉగ్రవాద సంస్థలతో కలిసిపని చేసినట్టు ఆధారాలు లభించాయి. పలు సందర్భాల్లో అయోధ్యలో పర్యటించి, కీలక సమాచారాన్ని విదేశాలకు చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. గుజరాత్ ఏటీఎస్ ఆధ్వర్యంలో అతడిని మరింత విచారించేందుకు గుజరాత్ తరలించినట్లు సమాచారం.

MLC Elections Results : ఉత్తరాంధ్ర ఫలితం వచ్చేసింది

ఫైజాబాద్‌లో మటన్ దుకాణం నడుపుతూ అప్పుడప్పుడూ ఆటోడ్రైవర్‌గా పనిచేసే అబ్దుల్ రెహమాన్, ఫరీదాబాద్‌లోని పాలి ప్రాంతంలో ఒంటరిగా నివాసముండేవాడు. అక్కడే హ్యాండ్ గ్రనేడ్లు దాచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. అతడు పలు మార్గాల్లో రైలు ప్రయాణాలు చేసి, సాయుధ సామగ్రిని అయోధ్యకు తరలించాలని యత్నించినట్లు గుర్తించారు. అయితే ముందుగానే భద్రతా విభాగాలు అప్రమత్తమవడంతో అతడిని పట్టుకునే అవకాశం లభించింది. ఈ సంఘటనతో అయోధ్య రామాలయం పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. గుజరాత్ ఏటీఎస్ ఇంకా అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నడం భారత భద్రతా దళాలకు కొత్తకాదని, అయితే ఈసారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రమాదాన్ని అడ్డుకున్నామని అధికారులు వెల్లడించారు.

  Last Updated: 03 Mar 2025, 08:29 PM IST