Site icon HashtagU Telugu

DK : సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు ఎదురుదెబ్బ

Supreme Court Dismisses Dk

supreme-court-dismisses-dk-shivakumar-petition

DK Sivakumar: సుప్రీంకోర్టు(Supreme Court)లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల(Disproportionate Assets) వ్యవహారంలో తనపై నమోదైన సీబీఐ(CBI) కేసును కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్ఠానం కొట్టివేసింది. అంతేకాక ఇప్పటికే కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయని, దీనిపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, 2013-18 మధ్య అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress Govt)లో శివకుమార్‌(Sivakumar) మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో డీకే సంపాదనలో రూ.74 కోట్లు లెక్కకు మించిన ఆదాయం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన నివాసం, ఆఫీసుల్లో ఐటీ శాఖ సోదాలు జరిపి కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. అనంతరం ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌ దర్యాప్తు చేపట్టింది. ఈడీ విచారణ ఆధారంగా 2020లో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది.

ఈక ఈ కేసును సవాల్‌ చేస్తూ శివకుమార్‌ 2021లో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో దీనిపై ఉన్నత న్యాయస్థానం కొంతకాలం మధ్యంతర స్టే విధించింది. ఈ క్రమంలోనే సీబీఐ కేసును కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను గతేడాది అక్టోబరులో హైకోర్టు కొట్టేసింది. అంతేగాక.. దీనిపై దర్యాప్తు చేసి మూడు నెలల్లోగా నివేదిక అందివ్వాలని సీబీఐని ఆదేశించింది. ఈ తీర్పుపై డీకే సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయనకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఆయన క్వాష్‌ పిటిషన్‌ను కోర్టు సోమవారం కొట్టేసింది.

Read Also:TGRTC : తెలంగాణ లో కూడా బస్సు ఛార్జ్ లు పెరుగుతాయా..?