Stonecraft Group : బయోఫిలిక్, పర్యావరణ అనుకూల రియల్ ఎస్టేట్‌లో మార్గదర్శక సంస్థ అయిన స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్, ఉడ్స్ శంషాబాద్ వద్ద తమ విప్లవాత్మకమైన AQI (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) మానిటరింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ పట్ల కంపెనీ యొక్క స్థిరమైన నిబద్ధతను , పర్యావరణ స్పృహతో కూడిన ప్రాంగణాలను సృష్టించాలనే దాని లక్ష్యాన్ని నొక్కి చెబుతుంది. ఈ కార్యక్రమంలో స్లోవేనియా రిపబ్లిక్ రాయబారి మాటేజా వోడెబ్ ఘోష్, స్లోవేనియా రిపబ్లిక్ ఆర్థిక సలహాదారు శ్రీమతి టీ పిరిహ్, జీహెచ్ఎంసి అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ అదనపు కమిషనర్ శ్రీమతి వివిఎల్ సుభద్రా దేవి (ఐఎఫ్ఎస్) మరియు భారత ప్రభుత్వ మాజీ అదనపు కార్యదర్శి శ్రీ అశోక్ పవాడియా సహా సుప్రసిద్ధ నిపుణులు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: Smita Sabharwal : స్మితా సభర్వాల్‌కు రేపోమాపో నోటీసులు.. కారణం అదే
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, సమాజ ప్రయోజనం కోసం గాలి నాణ్యతను పర్యవేక్షించడంలో స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ యొక్క అంకితభావాన్ని వెల్లడించటమే కాకుండా పర్యావరణ స్థిరత్వం గురించి అవగాహన పెంచడానికి ఉత్ప్రేరకంగా కూడా నిలుస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రిబ్బన్ కటింగ్ తో పాటుగా ప్రారంభోత్సవ ప్రతీకగా చెట్లను నాటడం, ప్రాజెక్ట్ యొక్క విస్తృత ప్రభావాలను చర్చించడానికి అనుసంధానిత మీడియా సమావేశం వంటి అర్థవంతమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్లోవేనియా రిపబ్లిక్ రాయబారి మతేజా వోడెబ్ ఘోష్ పర్యావరణ అనుకూల కార్యక్రమాల యొక్క ప్రపంచ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, “ప్రభుత్వాలు, NGOలు, కార్పొరేట్లు లేదా వ్యాపారాలు, ఎవరైనా సరే , గాలి నాణ్యతను మెరుగుపరచడం , పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం కోసం సమిష్టిగా పనిచేయడం చాలా అవసరం అన్నారు.
శ్రీ కీర్తి చిలుకూరి నేతృత్వంలోని స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ వంటి రియల్ ఎస్టేట్ డెవలపర్‌లు టౌన్ ప్లానర్లు, ఆర్కిటెక్ట్‌లపై కీలక బాధ్యత ఉంది. పర్యావరణపరంగా స్థిరమైన మరియు శుభ్రమైన గాలి , ప్రభావ వంతమైన లైటింగ్ వచ్చేలా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలను నిర్మించడంలో వారి పాత్ర చాలా కీలకం. పర్యావరణ అనుకూల భవనాలు స్వచ్ఛమైన నీటి వనరులను ఉపయోగించాలి. వాటర్ హార్వెస్టింగ్ మరియు రీసైక్లింగ్ ప్రయత్నాలను చేయాలి , పునరుత్పాదక శక్తిని ఉపయోగించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా, మనం ఇటువంటి వినూత్న ప్రాజెక్టులను ఇప్పుడు చూస్తున్నాము. AQI మానిటరింగ్ స్టేషన్ వంటి ప్రభావవంతమైన ప్రాజెక్టులతో స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ వంటి కంపెనీలు పర్యావరణ పరిరక్షణ సమర్థిస్తున్నట్లు చూడటం స్ఫూర్తిదాయకం. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారం చాలా ముఖ్యమైనది మరియు ఈ కార్యక్రమం ఇతరులు అనుసరించడానికి ఒక వెలుగు రేఖలా పనిచేస్తుందని ఆశిస్తున్నాను. ఈ ప్రయత్నాలను మనం వేడుక జరుపుకోవాలి అని అన్నారు.
స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ ఇటీవల మూడు ప్రధాన ప్రాజెక్టులను : PGA గోల్ఫ్ సిటీ, వుడ్స్ ఇంద్రేషామ్ మరియు అసిస్టెడ్ లివింగ్ – ను విజయవంతంగా ప్రారంభించడంతో గణనీయమైన మైలురాళ్లను చేరుకుంది. సస్టైనబిలిటీ , బయోఫిలిక్ డిజైన్ మరియు వినూత్న జీవన పరిష్కారాలతో రియల్ ఎస్టేట్‌ను పునర్నిర్వచించడంలో దాని నిబద్ధతను ప్రదర్శించింది.
Read Also: Sunita Williams Net Worth: సునీతా విలియమ్స్ నికర సంపాదన ఎంతో తెలుసా?