Site icon HashtagU Telugu

Rocket : రేపు నింగిలోకి ఎగరనున్న SSLV D3 రాకెట్..కౌంట్‌ డౌన్‌ ఘరూ

SSLV D3 rocket will fly into Ningi tomorrow.. Countdown Gharoo

SSLV D3 rocket will fly into Ningi tomorrow.. Countdown Gharoo

SSLV D3 rocket : శ్రీ హరికోట (Sriharikota)లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి రేపు ఉదయం 9 గంటల 17 నిమిషాలకు ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌‌ ప్రయోగం జరగనుంది. ఈ మేరకు రేపు తెల్లవారుజామున 2 గంటల 47 నిమిషాలకు కౌంట్ డౌన్ షురూ కానుంది. ఆరున్నర గంటల పాటు కౌంటర్ ప్రక్రియ కొనసాగనుంది. రేపు ఉదయం 9 గంటల 17 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగం జరగనుంది. చెన్నైకి చెందిన స్టార్టప్ స్పేస్ రిక్షా యొక్క 175 కిలోల ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం EOS-8 ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెడతారు.

We’re now on WhatsApp. Click to Join.

EOS-8 ఉపగ్రహం కొత్త, భవిష్యత్తు సాంకేతికతలతో నిండి ఉందని.. ఇది ఇస్రో, భారతదేశ ప్రజల కలలకు శక్తినిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉపగ్రహంలోని ఒక ప్రత్యేక పరికరం అతినీలలోహిత (UV) కాంతికి గురికావడాన్ని కొలుస్తుంది. ఇది గగన్‌యాన్ మిషన్‌కు కూడా ఉపయోగపడుతుంది. ఈ పరికరం మిషన్ సమయంలో వ్యోమగాములు అతినీలలోహిత కాంతికి గురికావడాన్ని కొలుస్తుంది.

ఈ ఉపగ్రహాన్ని SSLV రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. అయితే.. 2022లో SSLV మొదటి ప్రయోగం విజయవంతం కాలేదు. ఆ తర్వాత.. 10 ఫిబ్రవరి 2023న రెండవ ప్రయోగం విజయవంతం కాగా.. ఈసారి మూడో ప్రయోగం జరుగనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. ఎస్‌ఎస్‌ఎల్‌విని వాణిజ్యపరంగా మరింత మెరుగైన రీతిలో ఉపయోగించుకోవచ్చని ఇస్రో భావిస్తోంది. కొత్త సాంకేతికతలను సిద్ధం చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్న ఇస్రో.. రాకెట్లను ప్రయోగిస్తూ అంతరిక్షరంగంలో వరుసగా విజయాలు సాధిస్తోంది.

Read Also: Spiritual: వర్క్ డెస్క్ మీద దేవుళ్ళ ఫోటోలు, విగ్రహాలు పెట్టుకోవచ్చా?