Sperm Donor: 16 ఏళ్లుగా వీర్యదానం.. సెర్మ్ డోనర్ కు షాకిచ్చిన కోర్టు

స్పెర్మ్స్ డొనేట్ చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న డచ్ కోర్టు...వెంటనే అతనిపై నిషేధం విధించింది.

Published By: HashtagU Telugu Desk
Sperm Count

Sperm Count

నెదర్లాండ్ లోని ఓ 41 ఏళ్ల వ్యక్తి దాదాపు 16 ఏళ్లుగా వీర్యదానం (Sperm Donor) చేస్తున్నాడట. ఇప్పటి వరకూ 550-600 చిన్నారులకు తండ్రి అయ్యాడు. అన్నేళ్లుగా స్పెర్మ్స్ డొనేట్ చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న డచ్ కోర్టు…వెంటనే అతనిపై నిషేధం విధించింది. ఇకపై దానం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆ వ్యక్తి పేరు జొనతన్ మీజర్ (Jonathan Meijer). కోర్టు తీర్పుని ఉల్లంఘించి మళ్లీ వీర్యదానం చేస్తే లక్ష యూరోల జరిమానా కట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. అంటే మన కరెన్సీలో రూ.90 లక్షలు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే…ఇప్పటికే కొన్ని క్లినిక్‌లకు వీర్యాన్ని డొనేట్ చేశాడు మీజర్. వాటిని ఇప్పటికిప్పుడు నిర్వీర్యం చేయాలని ఆయా క్లినిక్స్‌కి లేఖ రాయాలని కోర్టు ఆదేశించింది.

ఇదంతా ఓ మహిళ (Women) కంప్లెయింట్‌తో వెలుగులోకి వచ్చింది. హేగ్‌ సిటీలోని కోర్ట్‌లో మీజర్‌పై పిటిషన్ వేసింది. వీర్యదానం ఎంతమందికి చేస్తున్నాడన్న వివరాలు దాచి పెట్టి అందరినీ మోసం చేశాడంటూ మండి పడింది. అంతే కాదు. తమ ఫ్యామిలీలోనే చాలా మందికి తాను స్పెర్మ్స్‌ డొనేట్ చేశాడని, కానీ ఈ విషయం చెప్పలేదని ఆరోపించింది ఆ మహిళ. అందుకే కోర్టులో పిటిషన్ వేసినట్టు వివరించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు…మహిళ చేసిన ఆరోపణలు నిజమే అని తేల్చింది. వెంటనే…మీజర్‌కు నోటీసులు ఇచ్చింది. ఇకపై డొనేట్ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.

Also Read: Beauty Parlour: బ్యూటీపార్లర్‌ కు వెళ్లొద్దన్న భర్త.. ఉరేసుకున్న భార్య!

  Last Updated: 29 Apr 2023, 06:09 PM IST