Online Betting : శాసనసభ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది అంతర్జాతీయ నేరంగా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీ పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వీటి నిరోధానికి, నిషేధించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో పడే శిక్షలను కూడా సవరించాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: Space : ‘అంతరిక్షం’ లో వ్యవసాయం..సాధ్యపడుతుందా ?
గత ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్ నిషేధిస్తూచట్టం చేసింది. కానీ అమలు జరగడం లేదు. దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేస్తున్నాం. ప్రకటనలు చేసినా నిర్వహణలో భాగస్వామ్యం ఉన్నా కఠిన చర్యలు ఉంటాయి. నేరాలు చెప్పి జరగవు. నేరాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. గతంలో న్యాయవాదులు, వెటర్నరీ డాక్టర్ హత్యలు జరిగాయి అని రేవంత్ అన్నారు. అంతేకాక..గుట్కా వంటి నిషేధిత పదార్థాల సరఫరా పెరిగిందని తెలుస్తోంది. ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీ ప్రచారం కల్పించినవారిని విచారించాం. ప్రచారం కల్పించినవారిని విచారించడంతోనే ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు కాదు. సిట్ ఏర్పాటు చేసి వీటికి అడ్డకట్ట వేయాలని నిర్ణయించాం. ఆన్‌లైన్ బెట్టింగ్, నేరాల్లో ఏ రకంగా భాగస్వామ్యం ఉన్నా చర్యలు తప్పవు అని సీఎం రేవంత్ హెచ్చరించారు.
Read Also: Chicken : వేసవిలో ఎక్కువగా చికెన్ తింటున్నారా?