Stem Cells: నలుగురు అంధులకు చూపు.. స్టెమ్ సెల్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ మ్యాజిక్

అంధులకు (Blind) కళ్ళు తేవడాన్ని మనం సినిమాల్లోనే చూశాం. దీన్ని నిజం

అంధులకు కళ్ళు తేవడాన్ని మనం సినిమాల్లోనే చూశాం. దీన్ని నిజం చేసి చూపించే దిశగా స్టెమ్ సెల్స్ (మూలకణ) (Stem Cells) వైద్య రంగం దూసుకు పోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఉన్న GSVM మెడికల్ కాలేజీ నేత్ర వైద్య విభాగం స్టెమ్ సెల్స్ (మూలకణ) పరిశోధనలో అనూహ్య విజయాన్ని సాధించింది. పుట్టుకతో, తీవ్రమైన వ్యాధుల కారణంగా రెటీనా దెబ్బతిని కంటి చూపును కోల్పోయిన నలుగురు రోగులకు మళ్లీ చూపు వచ్చేలా చేసింది.ప్లాసెంటా అవశేషాల నుంచి సేకరించిన మూలకణాలను కళ్ళలోని రెటీనాలోకి ప్రవేశపెట్టి రోగులకు కంటిచూపు వచ్చేలా శాస్త్రవేత్తలు చేశారు.

తల్లి కడుపులోని పిండాన్ని.. తల్లి యొక్ కణజాలంతో కలిపే ప్రత్యేక నిర్మాణాన్ని ప్లాసెంటా (Placenta) అంటారు. కంటి చూపు తిరిగి వచ్చేలా చేయడంలో Placenta నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్ (Stem Cells) కీలక పాత్ర పోషించాయి.నాలుగు నెలల పాటు సాగిన ఈ పరిశోధనకు సంబంధించిన సమగ్ర నివేదికను GSVM మెడికల్ కాలేజీ శాస్త్రవేత్తలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కి పంపారు. పరిశోధన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన సౌకర్యాలు, వనరులను పెంచడానికి గ్రాంట్ ఇవ్వాలని కోరారు.

■ ప్రొఫెసర్ పర్వేజ్ ఖాన్‌ టీమ్ సక్సెస్..

2022లో GSVM మెడికల్ కాలేజీలో ప్రారంభించిన ఈ పరిశోధన కొన్ని నెలల్లోనే విజయవంతమైంది. వైద్య కళాశాలలోని నేత్రవైద్య విభాగం OPDలో, సమీపంలోని 15-20 జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కూడా రోగులు కంటి చూపు చికిత్స కోసం వస్తారు. అటువంటి రోగుల సమస్యలను పరిశీలించిన GSVM మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సంజయ్ కలా, స్టెమ్ సెల్స్‌పై పరిశోధన కోసం ఎథిక్స్ కమిటీ నుంచి అనుమతి తీసుకున్నారు. దీంతో ఆప్తమాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ పర్వేజ్ ఖాన్‌ పరిశోధన ప్రారంభించి దాన్ని సక్సెస్ ఫుల్ చేశారు.

■ ఆ నలుగురిపై పరిశోధన ఇలా జరిగింది

యూపీలోని బారాబంకికి చెందిన ఒక మహిళ, మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన ఒక రోగి, బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన మరో రోగి GSVM కళాశాలకు వచ్చారు. వీళ్లంతా పుట్టుకతో వచ్చే దృష్టి లోపంతో బాధపడేవారు. ఇక యూపీలోని ఉన్నావ్ కు చెందిన కానిస్టేబుల్ మొహమ్మద్ అసీమ్‌కు రెటీనా యొక్క నయం చేయలేని వ్యాధి ఉంది. చాలా సంవత్సరాలుగా ఆయన సరిగ్గా చూడలేక పోతున్నాడు. అయితే వీళ్ళందరిపై GSVM మెడికల్ కాలేజ్ శాస్త్రవేత్తలు స్టెమ్ సెల్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రయోగాలు చేశారు. నాలుగు నెలల తర్వాత ఆశ్చర్యం కలిగించే రిజల్ట్ వచ్చింది. వీళ్ళందరిపై మళ్లీ కంటిచూపు వచ్చేసింది. ఈ ప్రయోగంలో భాగంగా వీళ్ళందరి కంటి రెటీనాలోకి Placenta నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్ ను ప్రత్యేక సర్జరీ ద్వారా ప్రవేశపెట్టారు. దీంతో కంటి రెటీనా కు శక్తి వచ్చింది. వాళ్ళందరి చూపు తిరిగి వచ్చేసింది.

■ 50వేలకే సర్జరీ

రానున్న రోజుల్లో ఈ ట్రీట్మెంట్ ఖర్చు బాగా తగ్గుతుందట. కేవలం 50వేల రూపాయలకే స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ చేసుకోవచ్చని అంటున్నారు.

Also Read:  Children Foods: పిల్లలకు పొద్దున్నే ఇవ్వతగిన బెస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసా?