పహల్గామ్ (Pahalgam ) లో ఉగ్రవాదుల దాడి (Pahalgam Attack)దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో, ఆ ప్రాంతం సినీ పరిశ్రమకు కుదిపేసే విధంగా మారింది. ప్రకృతి అందాలకు కేరాఫ్ గా పేరుగాంచిన పహల్గామ్‌ను మినీ స్విట్జర్లాండ్‌గా అభిమానించే సినీ నిర్మాతలు, డైరెక్టర్లు ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మరచిపోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే పహల్గామ్ లో తెలుగు చిత్రాలు ‘నా పేరు సూర్య’, ‘పెళ్లి సందD’, ‘ఖుషీ’ వంటి చిత్రాలు చిత్రీకరణ జరిపిన సంగతి తెలిసిందే.
Veeraiah Chowdary : వీరయ్య చౌదరి ని హత్య చేయడానికి కారణం అదేనా..? పోలీస్ విచారణలో సంచలన విషయాలు ?
అయితే ఇప్పుడు జరిగిన మారణహోమం తర్వాత పహల్గామ్ వేదికగా షూటింగ్ చేయాలన్న ఆలోచనలకు బ్రేక్ పడింది. భద్రతా పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి వచ్చే వరకు ఆ ప్రాంతాన్ని సినీ చిత్రాల కోసం ఉపయోగించేందుకు నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారు. సినిమాల బడ్జెట్‌ను అదుపులో ఉంచేందుకు స్విట్జర్లాండ్ స్థానంలో పహల్గామ్‌ని ఎంచుకునే ట్రెండ్‌కి ఇది పెద్ద దెబ్బగా మారింది.
కేవలం సినీ పరిశ్రమ మాత్రమే కాదు, పర్యాటక రంగంపైనా ఈ దాడి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే పహల్గామ్ లో టూర్ ప్లాన్ చేసిన పర్యాటకులు, భయంతో టికెట్లు క్యాన్సిల్ చేసుకుని తిరిగి తమ నివాసాలకు వెళ్లిపోతున్నారు. భవిష్యత్తులో పహల్గామ్ మళ్లీ పర్యాటక, చిత్రీకరణ హబ్‌గా మారాలంటే భద్రతా వ్యవస్థ మరింత పటిష్టం కావాల్సిన అవసరం తప్పదు. ఏది ఏమైనప్పటికి ఉగ్రవాదుల దాడితో మినీ స్విట్జర్లాండ్ కాస్త దాడుల ల్యాండ్ గా మారింది.