Site icon HashtagU Telugu

Gang Raped by Girls: షాకింగ్ న్యూస్.. వివాహితుడిపై అమ్మాయిల ‘గ్యాంగ్ రేప్’

Gang Raped

Gang Raped

అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనలు చాలా విన్నాం.. చదివాం కూడా. కానీ ఓ మగవాడిపై గ్యాంగ్ రేప్ జరిగిందంటే నమ్మగలరా.. అంటే నమ్మి తీరాల్సిందే. ఈ షాకింగ్ ఘటన పంజాబ్‌లో జరిగింది. ఒక వ్యక్తి తనను కిడ్నాప్ చేసి, ఆపై ( 20 ఏళ్ల వయసున్న) నలుగురు అమ్మాయిలు సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించారు. అమ్మాయిలు తన కళ్లలో రసాయన స్ప్రే చేసిన తర్వాత తనను కారులో కిడ్నాప్ చేశారని ఆ వ్యక్తి చెప్పాడు. అనంతరం అటవీ ప్రాంతంలో మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపాడు.

ఈ ఘటన వైరల్ కావడంతో పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ఈ విషయంపై సుమోటోగా విచారణ ప్రారంభించింది. రేప్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని మహిళలు నగరంలోని ఏకాంత ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనపై దాడికి గురైన బాధితుడు ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఆ వ్యక్తి తనకు ఎదురైన కష్టాల స్థానిక మీడియాకు మాత్రం చెప్పాడు. అతను ఒక ఫ్యాక్టరీలో కూలీగా పనిచేన్నాడు. రాత్రి సమయంలో ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పంజాబ్ లోని కపుర్తలా రోడ్డు సమీపంలో వేచి ఉన్న సమయంలో,  కారులో ఉన్న యువతులు ఆ వ్యక్తిని అడ్డుకున్నారు.

అడ్రస్ అడిగి కారులో ఉన్న అమ్మాయిలు అతని కళ్ళలోకి స్ప్రే చేశారు. దీంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. కారులో కళ్లకు గంతలు కట్టి, చేయి, కాళ్లు చేతులు కట్టిపడేశారు. అనంతరం మత్తుమందు ఇచ్చి అటవీ ప్రాంతంలో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లినట్లు సమాచారం. అమ్మాయిలు మద్యం సేవించి, అతనిని తాగమని బలవంతం చేసి మరి గ్యాంగ్ రేప్ చేశారు. లైంగిక వేధింపుల తర్వాత, ఆ వ్యక్తిని తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఏకాంత ప్రదేశంలో పడేశారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.