CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) ఢిల్లీ మద్యం కుంభకోణానికి(Delhi liquor scam) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయి..దాదాపు 50 రోజుల పాటు జైలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటివల ఆయనకు లోక్‌సభ ఎన్నికల ప్రచారం(Lok Sabha election campaign) కోసం సుప్రీకోర్టు (Supreme Court) మధ్యంతర బెయిల్(Interim bail) ఇచ్చింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ తొలిసారి తన భార్య సునీత కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీలోని గాంధీనగర్‌లో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ప్రశంసిస్తూ.. ‘ఝాన్సీ కి రాణి’(Jhansi Ki Rani) అంటూ సంబోధించారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ‘ఈరోజు నాతోపాటు నా భార్యను కూడా వెంట తీసుకొచ్చా. నేను లేని సమయంలో ఆమె అంతా తానై నడిపించారు. నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను తరచూ కలిసేందుకు వచ్చేవారు. ఆమె ద్వారా ఢిల్లీ ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేవాడిని. వారికి నా సందేశాలు పంపేవాడిని. ఆమె ఝాన్సీ కి రాణి వంటివారు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. త్వరలో దేశానికి మంచిరోజులు రాబోతున్నాయని.. మోడీ వెళ్లిపోతున్నారని ఈ సందర్భంగా కేజ్రీవాల్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. విపక్ష కూటమికి ఈ ఎన్నికల్లో 300 సీట్లకుపైనే వస్తాయని జోష్యం చెప్పారు.
Read Also: CSK Dressing Room: అదంతా తప్పుడు ప్రచారమే కోహ్లీతో ధోనీ ఏమన్నాడో తెలుసా ?
మరోవైపు జూ2న కేజ్రీవాల్ లొంగిపోవాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బెయిల్ పీరియడ్‌లో ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే, మళ్లీ ఆయన జైలుకు వేళ్లే అవకాశాలు ఉండటంతో తన భార్య సునీతను ప్రమోట్ చేసే ఉద్దేశంలో కేజ్రీవాల్ ఉన్నారని రాజకీయ ప్రముఖులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే తన ఎన్నికల ప్రచారంలో భార్యతో కలిసి హాజరయ్యారని.. ఆమెను ఝాన్సీ రాణితో పోలుస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.