ShareChat : ట్విటర్ బాటలో షేర్ చాట్.. ట్విటర్ మాదిరిగానే షేర్ చాట్ కూడా బ్లూ టిక్ అమ్మకం

బ్లూ టిక్ ఉండాలంటే డబ్బులు కట్టాలని పేర్కొంది

  • Written By:
  • Publish Date - August 16, 2023 / 02:38 PM IST

ప్రస్తుతం యువత తో పాటు పెద్దవారు సైతం సోషల్ మీడియా (Social media) లో యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రపంచం లో ఏంజరిగిన..ఏ సమాచారం తెలుసుకోవాలన్న క్షణాల్లో సోషల్ మీడియా లో ప్రత్యేక్షం అవుతుంది. దీంతో అంత సోషల్ మీడియా లో తమ ఖాతాలు తెరుస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ , ఇంస్టాగ్రామ్ , యూట్యూబ్ , పేస్ బుక్ , షేర్ చాట్ ఇలా రకరకాల పేజీలలో అకౌంట్స్ ఓపెన్ చేసి అందులో తమ సమాచారాన్ని పెడుతున్నారు.

ఇదిలా ఉంటె ట్విట్టర్ లో సెలబ్రటీస్ ఖాతాలకు మాత్రం బ్లూ టిక్ అనేది గతంలో ఉండేది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కంపెనీలు, బ్రాండ్‌లు, వార్తా సంస్థలు మరియు ఇతర “ప్రజా ప్రయోజనాల” ఖాతాలు నిజమైనవని గుర్తించడానికి కంపెనీ 2009లో బ్లూ టిక్ మార్క్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ధృవీకరణ కోసం కంపెనీ ఇంతకు ముందు ఎలాంటి డబ్బులు వసూలు చేయలేదు. ఎలోన్ మస్క్ ట్విట్టర్ సొంతం చేసుకున్న తర్వాత బ్లూ టిక్, గోల్డ్ టిక్, గ్రే టిక్ తీసుకొట్టారు. ప్రభుత్వ సంబంధిత ఖాతాల కోసం గ్రే టిక్ వెరిఫికేషన్ కేటాయిస్తున్నారు. కంపెనీలకు గోల్డెన్ టిక్ మార్క్ ను ఇస్తున్నారు.

ట్విట్టర్ బ్లూటిక్ (Twitter Blue tick price) కోసం ప్రపంచ వ్యాప్తంగా నెలకు 7 అమెరికన్ డాలర్లు చెల్లించాలి. iOS లేదా ఆండ్రాయిడ్ లో ట్విట్టర్ ని ఉపయోగించినట్లైతే నెలకు 11 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. భారత్ లో అయితే, Ios, Android వినియోగదారులు ట్విట్టర్ బ్లూ టిక్ కోసం నెలకు రూ. 900 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వెబ్ క్లయింట్స్ అయితే రూ. 650 ఇవ్వాల్సి ఉంటుంది. అటు ఏడాదికి గాను బ్లూటిక్ కోసం రూ. 6,500 ప్లాన్ ను అందుబాటులో ఉంచింది. ఇక ఇప్పుడు షేర్ చాట్ (sharechat) కూడా ట్విట్టర్ బాటలోనే వెళ్తుంది. ఇప్పటివరకు బ్లూ టిక్ (Blue tick) అనేది సెలబ్రటీస్ ఖాతాలకు ఉండేది కానీ..ఇక నుండి ఆలా బ్లూ టిక్ ఉండాలంటే డబ్బులు కట్టాలని (Sharechat blue tick price) పేర్కొంది. SC Blue పేరుతో ఛార్జ్ చేస్తుంది. నెలకు రూ.297 ఛార్జ్ చేస్తుంది. ఈ డబ్బులు కట్టినవారికి SC Blue టిక్ అనేది వస్తుంది. ఈ టిక్ ద్వారా పలు ఆఫర్లు కూడా వస్తాయని పేర్కొంది. ఈ నిర్ణయం ఫై విమర్శలు అయితే వస్తున్నాయి.

Read Also : WHO Alert: బాంబు పేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, కొత్త వేరియంట్ పై హెచ్చరిక!