Site icon HashtagU Telugu

MLA quota MLCs : ప్రమాణ స్వీకారం చేసిన ఏడుగురు కొత్త ఎమ్మెల్సీలు

Seven new MLCs sworn in

Seven new MLCs sworn in

MLA quota MLCs : తెలంగాణ రాష్ట్రలో ఇటీవల జరిగిన రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీ లు ఈ రోజు తెలంగాణ శాసన మండలి లో ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ నుంచి ఎన్నికైన నెల్లికంటి సత్యం ప్రమాణం చేశారు. వీరితో పాటు పట్లభద్రుల,టీచర్ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్య, శ్రీపాల్ రెడ్డిలు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మరో రోజు ప్రమాణం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రఘునందన్ రావులు పాల్గొన్నారు. అలాగే నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్‌ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఇటీవల తెలంగాణలో జరిగిన రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

Read Also: Amaravati : అమరావతి నిర్మాణానికి రూ.4,285 కోట్లు విడుదల చేసిన కేంద్రం