Site icon HashtagU Telugu

Terrorist Hideout : పంజాబ్‌లో ఉగ్ర కుట్రను భగ్నం చేసిన భద్రతా బలగాలు

Security forces foil terror plot in Punjab

Security forces foil terror plot in Punjab

Terrorist Hideout : పహల్గాం ఉగ్రదాడి తరువాత దేశవ్యాప్తంగా మళ్లీ ఉగ్రదాడుల ప్రమాదం ఉన్నట్టు భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ హెచ్చరికలతో దేశ వ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా పంజాబ్‌లోని అటవీ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలపై పోలీసు, భద్రతా దళాలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయి. తాజాగా, పంజాబ్‌లోని ఓ అటవీ ప్రాంత సమీపంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో పోలీసులు భారీ మోతాదులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దర్యాప్తులో భారీగా గ్రెనేడ్లు, ఐఈడీలు (ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైసులు), మరియు ఉగ్రవాదుల కమ్యూనికేషన్‌కి ఉపయోగించే వైర్‌లెస్ హార్డ్‌వేర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో భవిష్యత్ ఉగ్రదాడులకు గంపెడాశలుగా తయారు చేసిన ప్లాన్‌ను భద్రతా బలగాలు భగ్నం చేశాయి.

Read Also: United Nations : భారత్, పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు..

పంజాబ్ రాష్ట్రంలో స్లీపర్ సెల్స్‌ను మళ్లీ చురుకుగా మార్చేందుకు పాకిస్తాన్ నిఘా సంస్థ ISIతో సంబంధాలున్న ఉగ్రవాద గుంపులు తీవ్రంగా యత్నిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై రాష్ట్ర డీజీపీ స్పందిస్తూ, “ఉగ్రవాద సంస్థలు పంజాబ్‌ను మళ్లీ టార్గెట్ చేయాలని చూస్తున్నాయి. అయితే మేము పూర్తి అప్రమత్తంగా ఉన్నాము,” అని తెలిపారు. ఇక, జమ్మూ కశ్మీర్ పరిధిలోనూ భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి. బుద్గాం జిల్లాలో ముష్కరులకు మద్దతిస్తున్న ఇద్దరు వ్యక్తులను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. వారి వద్ద నుంచి పెద్దఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది అక్కడి ఉగ్ర మూలకాలకు తీవ్రమైన దెబ్బగా అధికారులు భావిస్తున్నారు. అంతకుముందు, కుప్వారా జిల్లాలో భద్రతా దళాలు ఓ ఉగ్రవాద గుట్టు స్ధావరాన్ని ధ్వంసం చేయగా, అక్కడ భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు పట్టుబడ్డాయి. వరుసగా జరుగుతున్న ఈ చర్యలు దేశంలో ఉగ్ర ముప్పు పట్ల భద్రతా వ్యవస్థ ఎంతటి అప్రమత్తత చూపుతోందనేది స్పష్టంగా చూపిస్తున్నాయి.

Read Also: China + Pakistan: పాక్‌ ఆయుధాలన్నీ మేడిన్ చైనా.. చైనా ఉత్పత్తులన్నీ బైకాట్ చేద్దామా ?