SC classification: తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కాలపరిమితిని మరో నెల రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10తో జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ గడువు ముగియగా, మార్చి 10 వరకు పొడిగించింది. ఎస్సీల వర్గీకరణపై అధ్యయనం చేసి సిఫార్సు చేసేందుకు జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్‌గా బాధ్యతలు చేపట్టి ఇటీవలే నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో కమిషన్ కాలపరిమితిని మార్చి 10 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Big Shock : వంశీకి సంబదించిన కీలక వీడియో ను విడుదల చేసిన టీడీపీ
ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లలో కొన్ని లోపాలున్నాయని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో మందకృష్ణ సమావేశం అయ్యారు . ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిని కలిశారు. ఎస్సీ వర్గీకరణను ఏ,బీ,సీలుగా వర్గీకరణ చేసింది. దీనివల్ల కొన్ని కులాలకు అన్యాయం జరుగుతోంది. ఎస్సీలలో అత్యధికంగా మాదిగలు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణలో ప్రభుత్వం ఆమోదించిన నివేదికలో లోపాలను సవరించి అన్ని కులాలకు న్యాయం చేయాలని ఎంఆర్‌పీఎస్ డిమాండ్ చేసింది. అధిక జనాభా ఉన్న మాదిగలకు గ్రూప్ B లో 9 శాతం రిజర్వేషన్ల ఇచ్చారు. దాన్ని 11 శాతానికి పెంచాలని సీఎంను మందకృష్ణ కోరాడు .
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన మాలలకు జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ శాతం రిజర్వేషన్ కేటాయించారని. గతంలో బి అండ్ సి గ్రూప్ లో ఉన్న మన్నే కొలుపులవాండ్లు పంబాడ, పంబాల, పంపండ కులాలను గ్రూప్ సి లో ఉంచాలి. ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీకి మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. కొన్ని కులాలు జనాభా లేక పోయినా వారిని మొదటి గ్రూప్‌లో ఒక శాతం రిజర్వేషన్ల ఇచ్చారు. వెనకబడిన మాదిగ కులానికి రిజర్వేషన్లు అన్యాయం జరిగిందని. ఎక్కువ జనాభా ఉన్న నేతకానీలను మాలలు ఉన్న సి గ్రూప్ లో వేయడంతో వారికి అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న మాదిగలే మాలలతోని తట్టుకోలేక పోయారు పేర్కొన్నారు. ఎక్కువ జనాభా ఉన్న బేడ బుడగ జంగాలను అత్యధికంగా వెనుకబడిన ‘ఏ’ గ్రూపులో వేశారు.
Read Also: Hydraa : హైడ్రా తీరుపై మరోసారి హైకోర్టు సీరియస్