Site icon HashtagU Telugu

Sandeep Kishan : రెజీనా తో సందీప్ కిషన్ ప్రేమాయణం?

Sandeep Kishan Regina

Sandeep

టాలీవుడ్ లో మరో ప్రేమాయణం నడుస్తోందనే వార్త వైరల్. సందీప్ కిషన్ (Sandeep Kishan), రెజీనా కసాండ్రా (Regina Cassandra) ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో (Social Media) పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి వీరి ప్రేమకు సంబంధించిన వార్తలు గతంలోనే వచ్చాయి. ఇప్పుడు తాజాగా సందీప్ కిషన్ (Sandeep Kishan) చేసిన ట్వీట్ ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. రెజీనా పుట్టిన రోజు సందర్భంగా సందీప్ ఈ ట్వీట్ చేశాడు. ‘హ్యాపీ బర్త్ డే పాప. లవ్యూ. అన్ని విషయాలలో నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. స్టే బ్లెస్డ్’ అని సందీప్ ట్వీట్ చేశాడు. అంతేకాదు, ఆమెతో చాలా సన్నిహితంగా ఉన్న ఓ సెల్ఫీ ఫొటోను కూడా షేర్ చేశాడు. దీంతో, వీరి ప్రేమ వ్యవహారం నిజమే అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

Also Read:  Heroine : పెళ్లయిన హీరోయిన్ కోసం గూగుల్ లో సెర్చ్