Samsung: నిద్రలేని వేసవి రాత్రుల పోరాటం చివరకు ముగియనుంది. భారతదేశంలోని ప్రముఖ వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్త మ తాజా ఆవిష్కరణ – ‘కస్టమైజ్డ్ కూలింగ్’తో ఇంటి చల్లదనాన్ని పునర్నిర్వచిస్తోంది. ఈ తరహా మొట్టమొదటి ఫీచర్ , సామ్‌సంగ్ స్మార్ట్ ఎయిర్ కండిషనర్లను WWST (వర్క్స్ విత్ స్మార్ట్‌థింగ్స్) సర్టిఫైడ్ ఫ్యాన్లు మరియు స్విచ్‌లతో సమకాలీకరిస్తుంది, మెరుగైన విద్యుత్ పొదుపుతో నిరంతరాయ సౌకర్యాన్ని అందిస్తుంది.
మనం నిద్రలేస్తూనే అలసిపోయినట్లుగా ఎందుకు ఉంటాము? నిద్ర & చల్లదనం వెనుక ఉన్న శాస్త్రం. భారతదేశం యొక్క విద్యుత్ డిమాండ్ ఏటా 6-7% పెరుగుతోంది. వేసవి నెలల్లో ఎయిర్ కండిషనర్ల వాడకం పెరగడం వల్ల ఇది మరింతగా పెరుగుతోంది (IEA నివేదిక). చాలా గృహాలు ఇప్పటికీ సౌకర్యం కోసం ఎయిర్ కండిషనర్లు , ఫ్యాన్లు రెండింటిపై ఆధారపడుతున్నాయి. నిజానికి, సామ్‌సంగ్ యొక్క వినియోగదారుల అనుభవ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, చాలా వరకూ భారతీయ ఇళ్లలో కనీసం మూడు ఫ్యాన్లు ఉన్నాయి. ఈ పరికరాలు రోజువారీ జీవితంలో పోషించే ముఖ్యమైన పాత్రను ఇవి వెల్లడిస్తాయి. ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే , 50% మంది భారతీయ వినియోగదారులు ఒకేసారి రెండింటినీ ఉపయోగిస్తున్నారు. చాలా చల్లగా ఉన్నప్పుడు ఏసి ని ఆఫ్ చేయడం ద్వారా లేదా గది వేడెక్కినప్పుడు తిరిగి ఆన్ చేయడం ద్వారా రాత్రంతా తరచుగా సెట్టింగ్‌లను సర్దుబాటు చేస్తున్నారు.
Read Also: Pawan Kalyan : మీ బాగోగులు చూడటానికి మేం ఉన్నాం: పవన్‌కల్యాణ్
ఈ స్థిరమైన సర్దుబాటు నిద్రకు అంతరాయం కలిగించడమే కాకుండా అధిక విద్యుత్ వినియోగం , అసౌకర్యానికి దారితీస్తుంది. ఈ సవాలును గుర్తించిన సామ్‌సంగ్ , 2025 బెస్పోక్ ఏఐ శ్రేణి ఎయిర్ కండిషనర్లలో ‘కస్టమైజ్డ్ కూలింగ్’ అనే స్మార్ట్ థింగ్స్-ఆధారిత పరిష్కారాన్ని పరిచయం చేసింది, ఇది మాన్యువల్ సర్దుబాట్లు అవసరం లేకుండా రాత్రంతా – మరియు పగటిపూట కూడా – స్వయంచాలకంగా స్థిరమైన రీతిలో సౌకర్యవంతంగా ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది. ఈ సౌకర్యవంతమైన అనుసంధానిత సామ్‌సంగ్ స్మార్ట్ ఏసిలను స్మార్ట్ థింగ్స్-సర్టిఫైడ్ ఫ్యాన్లు మరియు స్విచ్‌లతో సమకాలీకరిస్తుంది. తగ్గిన విద్యుత్ బిల్లులతో పాటు మెరుగైన సౌకర్యాన్ని నిర్ధారిస్తుంది.
“సామ్‌సంగ్ వద్ద, నిజమైన సౌకర్యం చల్లదనానికి మించి ఉంటుందని మేము నమ్ముతున్నాము. ఇది వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉండే తెలివైన, వ్యక్తిగతీకరించిన అనుభవాల గురించి. భారతీయ వినియోగదారులు తరచుగా రాత్రిపూట సౌకర్యవంతంగా ఉండటానికి ఏసిలు మరియు ఫ్యాన్‌లపై ఆధారపడుతుంటారు. కస్టమైజ్డ్ కూలింగ్‌తో, స్మార్ట్‌థింగ్స్-సర్టిఫైడ్ ఫ్యాన్లు మరియు స్విచ్‌లతో 2025 బెస్పోక్ ఏఐ శ్రేణి ఏసి లను సజావుగా నిర్వహించటం ద్వారా తరచుగా సర్దుబాట్లని చేయాల్సిన ఇబ్బందిని మేము తొలగిస్తున్నాము. ఇది మనశ్శాంతి, విద్యుత్ పొదుపు మరియు ఎలాంటి ఇబ్బంది లేని రీతిలో విశ్రాంతిని అందిస్తుంది ”అని సామ్‌సంగ్ ఇండియా డిజిటల్ ఉపకరణాల వైస్ ప్రెసిడెంట్ ఘుఫ్రాన్ ఆలం అన్నారు. అంతేకాకుండా, ఈ ఫీచర్ నిద్రను మెరుగుపరచడానికి రూపొందించబడినప్పటికీ, సౌకర్యం లేదా విద్యుత్ పొదుపు పరంగా రాజీ పడకుండా రోజంతా సౌకర్యవంతంగా ఉండటానికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.
స్మార్ట్, విద్యుత్ పొదుపు చేస్తుంది మరియు పర్యావరణ అనుకూలం
‘కస్టమైజ్డ్ కూలింగ్’ ఫీచర్ మాన్యువల్ సర్దుబాట్ల అవసరాన్ని తొలగిస్తుంది. సమతుల్యమైన , ఆహ్లాదకరమైన రీతిలో రాత్రి నిద్రను నిర్ధారిస్తుంది. ఇది స్వయంచాలకంగా పరిసర వాతావరణానికి అనుగుణంగా పనిచేస్తుంది. ఫ్యాన్ మరియు ఏసి సెట్టింగ్‌లను సమకాలీకరించి సర్దుబాటు చేస్తుంది. నిద్రలో లేదా రోజులో ఏ సమయంలోనైనా సౌకర్యవంతమైన గది వాతావరణాన్ని నిర్వహించడానికి తోడ్పడుతూనే, విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. స్మార్ట్‌థింగ్స్ ఎనర్జీ సర్వీస్‌లో అందుబాటులో ఉన్న ‘కస్టమైజ్డ్ కూలింగ్’ ఫీచర్ సౌకర్యం మరియు స్థిరత్వం రెండింటినీ నిర్ధారిస్తుంది. ఈ ఫీచర్ WWST-సర్టిఫైడ్ స్మార్ట్ ఫ్యాన్‌లు మరియు స్మార్ట్ స్విచ్‌లకు అనుకూలంగా ఉంటుంది. వినియోగదారులు దీనిని తమ స్మార్ట్ హోమ్‌లలో సులభంగా అనుసంధానించడానికి అనుమతిస్తుంది. ఈ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్‌థింగ్స్ అనుభవంతో, వినియోగదారులు ఇంటి చల్లదనం ను అనుభవించే విధానాన్ని సామ్‌సంగ్ మారుస్తోంది. ఇది సౌకర్యవంతమైన నిద్రను నిర్ధారించడం లేదా పగటిపూట సులభంగా స్మార్ట్ సౌకర్యాన్ని అందించడం అయినా, ఏసి మరియు ఫ్యాన్ సెట్టింగ్‌ల మధ్య టగ్-ఆఫ్ వార్ చివరకు ముగుస్తుంది. ఎందుకంటే సాంకేతికత మీ కోసం పనిచేసినప్పుడు, సౌకర్యం సులభంగా మీకు చేరువవుతుంది.