Site icon HashtagU Telugu

Drug : ముంబైలో రూ.3.25 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

Rs.3.25 crore drugs seized in Mumbai

Rs.3.25 crore drugs seized in Mumbai

 

Drug : ముంబై పోలీస్‌ శాఖ(Mumbai Police Dept)యాంటీ నార్కోటిక్స్‌ సెల్‌ (ANC) రూ.3.25 కోట్ల విలువైన దాదాపు 16 కిలోల డ్రగ్స్‌(Drug)ను స్వాధీనం చేసుకున్నారు. 12 మంది పెడ్లర్లను అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. నగర సమీపంలోని సహర్‌ గ్రామం, నల్లసొపార, శాంటాక్రుజ్, కుర్లా, బైకుల్లా తదితర ప్రాంతాలకు చెందిన పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎన్‌సీ అధికారులు పేర్కొన్నారు. వీరి నుంచి హెరాయిన్, గంజాయి, ఎండీని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో సహర్‌ గ్రామంలో ఒకరిని, నల్లసొపార నుంచి ఇద్దరు, శాంటాక్రుజ్ నుంచి ముగ్గురు, దక్షిణ ముంబై నుంచి ఇద్దరు చొప్పున పెడ్లర్లు పట్టుబడ్డారు. కుర్లా, బైకుల్లా నుంచి ఒక్కొక్కరు చొప్పున నైజీరియన్‌ జాతీయుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.2.24 కోట్ల విలువైన ఎండీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసున్నట్లు అధికారులు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

అంధేరిలో రూ. 1.02 కోట్ల విలువైన గంజాయి, హెరాయిన్‌తో మరో వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. వీటిని సీజ్‌ చేసిన పోలీసులు, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నెల రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.3.25 కోట్ల విలువైన దాదాపు 16 కిలోల డ్రగ్స్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 17 కేసులు నమోదు చేసి 43 మంది డ్రగ్స్‌ పెడ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.23.59 కోట్ల విలువైన 30.843 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని ముంబై పోలీస్‌ శాఖ యాంటీ నార్కోటిక్స్‌ సెల్‌ వెల్లడించింది. అలాగే వారి నుంచి రూ.4.05 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.

Read Also:  Ponguleti Prasad Reddy: ఖమ్మంలో పొంగులేటి బ్రదర్ హామీలు

కాగా 2023లో ANC నివేదికల ప్రకారం.. 106 డ్రగ్‌ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. అలాగే 229 డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి 53.23 కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది.