Kargil War In Photos : 24 ఏళ్ల క్రితం సరిగ్గా జూలై 26న కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌ను మట్టి కరిపించి భారత్ విజయ బావుటా ఎగురవేసింది. 1999 జులై 26న భారత్ సాధించిన ఘన విజయానికి గుర్తుగా ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకుంటున్నాం. కార్గిల్ యుద్ధంలో 500 మందికి పైగా భారత సైనికులు అమరులయ్యారు. పాకిస్తాన్ – భారత్‌ల మధ్య జరిగిన చెప్పుకోదగ్గ యుద్ధాలలో కార్గిల్ యుద్ధమే చివరిదిగా నిలిచింది. ఇరు దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశంగా గుర్తింపు పొందాక యుద్ధానికి దిగడం కూడా అదే తొలిసారి. కార్గిల్ యుద్ధ వాతావరణానికి అద్దంపట్టే కొన్ని ఫోటోలు(Kargil War In Photos) మీకోసం..
ఈమె పేరు గుంజన్ సక్సేనా. కార్గిల్ యుద్ధంలో హెలికాప్టర్ పైలట్ గా విశేష సేవలు అందించారు. కార్గిల్ యుద్ధంలో గాయాలపాలైన సైనికులను ఆస్పత్రులకు తరలించడం, రవాణా సామాగ్రిని సప్లై చేయడం, నిఘా వ్యవహారాల్లో సహాయం చేయడం వంటి పనుల్లో ముఖ్య పాత్ర పోషించారు. 1996లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన గుంజన్ సక్సేనా 1999లో వచ్చిన కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. 2004 వరకు.. అంటే ఎనిమిది సంవత్సరాల పాటు పైలట్‌గా సేవలు అందించారు. (ఫైల్)
కార్గిల్ యుద్ధంలో భాగంగా పాక్ సైన్యం, పాక్ తీవ్రవాదుల గుడారాలు టార్గెట్ గా ఫిరంగులు, మోర్టార్లతో దాడి చేస్తున్న భారత సైన్యం (ఫైల్)
కార్గిల్ యుద్ధంలో భాగంగా ఎగువ ప్రాంతంలో పాక్ సైన్యం, పాక్ తీవ్రవాదులు ఏర్పాటు చేసుకున్న గుడారాలపై దాడి చేస్తున్న భారత సైన్యం (ఫైల్)
కార్గిల్ యుద్ధం వేళ బటాలిక్ సెక్టార్ వద్ద భారత సైన్యం (ఫైల్)
కార్గిల్ యుద్ధం వేళ పాక్ సైన్యంపై దాడి చేయడానికి యుద్ధ సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్న భారత ఆర్మీ (ఫైల్)
కార్గిల్ యుద్ధంలో గెల్చిన తర్వాత భారత ఆర్మీ (ఫైల్)
కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులకు తుది వీడ్కోలు పలుకుతున్న సైనికులు (ఫైల్)
జమ్మూ కాశ్మీర్ లోని డ్రాస్ సెక్టార్ లో ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్ లో ఏర్పాటు చేసిన “ఆపరేషన్ విజయ్” సందేశ సూచిక (ఫైల్)
జమ్మూ కాశ్మీర్ లోని డ్రాస్ సెక్టార్ లో ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్ లో ఏర్పాటు చేసిన “ఆపరేషన్ విజయ్” సందేశ సూచిక (ఫైల్)
Also read : Kapurthala: భారత్ లో అత్యంత చిన్న నగరం ఏదో తెలుసా.. ఆ నగరం ప్రత్యేకతలు ఇవే?