Site icon HashtagU Telugu

Job calendar : దేశంలోనే వినూత్నంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన రేవంత్‌ సర్కార్

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : దేశంలోనే వినూత్నంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు కాంగ్రెస్‌ ప్రకటన చేసింది. తొలి ఏడాదిలోనే అర లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని..ఏడాది పొడవునా జాబ్ మేళా నిర్వహించినట్లు రేవంత్‌ ప్రభుత్వం పేర్కొంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వం.. ప్రజా పాలనలో తెలంగాణ యువత భవిత మలుపు తిరిగింది. తొలి ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల మేళా నిర్వహించింది. ఉద్యోగాల భర్తీలో కొత్త రికార్డు నమోదు చేసింది. గడిచిన పదేండ్లలో ఉద్యోగాల భర్తీ లేక విసిగి వేసారిన నిరుద్యోగుల జీవితాల్లోకాంగ్రెస్‌ సరికొత్త మార్పుతెచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటి ఏడాదిలోనే 53 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రద్దయినవి.. వాయిదా పడ్డవి.. పెండింగ్ లో పెట్టిన ఫలితాలన్నింటినీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వార్షిక జాబ్ క్యాలెండర్ ను ప్రకటించింది. అప్పటివరకు పెండింగ్ లో ఉన్న పరీక్షలు, ఫలితాలకు ఉన్న అడ్డంకులన్నింటినీ ప్రభుత్వం తొలిగించింది. పదేండ్లుగా ఉద్యోగాల భర్తీ లేనందున యువత నష్టపోకుండా టీజీపీఎస్సీ నియామకాలకు వయో పరిమితిని సడలించింది.

బీఆర్ఎస్ హయాంలో పదేండ్లలో ఒకేసారి డీఎస్సీ వేసి 7857 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే… కొత్త ప్రభుత్వం కేవలం పది నెలల వ్యవధిలోనే 11062 పోస్టులతో మెగా డీఎస్సీ 2024 నిర్వహించింది. క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను నిరంతర ప్రక్రియగా నిర్వహించే వినూత్న విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జులైలో పరీక్షలు నిర్వహించి, రికార్డు వేగంతో సెప్టెంబర్ 30వ తేదీన ఫలితాలను వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగ సందర్భంగా నియామక పత్రాలు అందించారు. వీరిలో 10006 మంది ఉద్యోగాల్లో చేరారు.

Read Also: YS Sharmila: ప్రభాస్ తో రిలేషన్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల