Republic Day Celebrations : దేశ రాజధాని ఢిల్లీలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల కు ముందు ఫ్లయింగ్ పాస్ట్ రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముందు ఫ్లయింగ్ పాస్ట్ రిహార్సల్స్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు, హెలిక్యాప్టర్‌లు, విమానాలతో ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది చేస్తున్న విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ఈ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ సారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో చీఫ్ గెస్టుగా వస్తున్నారు.
కాగా, ఈ వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపుతోంది. ప్రత్యేక అతిథులుగా దేశంలో పలు రాష్ట్రాల నుంచి ఎంతో మందిని కేంద్ర ప్రభుత్వ ఆహ్వానించి వారు చేసిన సేవలను గుర్తించి గౌరవిస్తుంది. ఇందులో భాగంగానే.. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు తెలంగాణ నుంచి ఏకంగా 41 మంది స్పెషల్ గెస్టులను కేంద్ర సర్కార్ ఆహ్వానించటం విశేషం. తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ఎంపికైన వాళ్లంతా.. కేంద్ర ప్రభుత్వ పథకాలను సంపూర్ణంగా వినియోగించుకున్నవారు. పీఎం యశస్వి పథకం, టెక్స్‌టైల్ హస్తకళల పథకాలు, గ్రామీణ అభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ వంటి విభాగాలు వారి జీవితాలను మార్చడంలో కీలక పాత్ర పోషించినట్టు గుర్తించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులను ఎంపిక చేసి, వారికి ప్రత్యేక ఆహ్వానాన్ని అందించింది. అయితే.. 41మందిలో వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుకున్నవారితో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా ఉపయోగించుకున్నవారు కూడా ఉంటారు. రిపబ్లిక్ డే పరేడ్ స్టేట్ నోడల్ ఆఫీసర్ అంకం రాజేశ్వర్, పీఎం జన్మన్, మహ్మద్ ఖాదీర్ అహ్మద్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంపికైన లబ్ధిదారుల గౌరవార్థం ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమాల్లో వీరిని ప్రజెంట్ చేయటం దేశానికి గర్వకారణమని వారు అభిప్రాయపడ్డారు.
Read Also: New Suzuki Access 125: పేరుకే స్కూటీ.. ఫోన్‌లో ఉన్న ఫీచర్లు అన్ని ఉన్నాయ్!