Site icon HashtagU Telugu

Lending Money Rules: అప్పు ఇస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఇవి మర్చిపోతే అంతే!

Qgajmuuo Indian Rupee Generic 625x300 15 January 19

Qgajmuuo Indian Rupee Generic 625x300 15 January 19

ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సందర్భంలో అప్పు చేస్తూనే ఉంటాడు.. అప్పు లేకుండా ఎవరి జీవితాలు కూడా గడవవు. ఈ అప్పు అనేది ఒక అవసరం కోసం చేస్తూ ఉంటారు. అది స్నేహితులు లేదా బంధువులు లేదా బయట వ్యక్తులతో అప్పు చేస్తూ ఉండటం సహజం. అప్పు కావాలి అన్నప్పుడు కొంతమంది బ్యాంకుల్లో కూడా లోన్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే బ్యాంకులు అప్పు ఇచ్చే ముందుగా ఎన్నో రకాల కండిషన్లని పెడుతూ ఉంటాయి. బ్యాంకుల వారు ఎన్నో అప్లికేషన్ లు ఫామ్ లు ఫిలప్ చేసిన తర్వాత అప్పుడు అప్పులను ఇస్తూ ఉంటారు. మరి మనం బయట ఫ్రెండ్స్ కి అప్పులు ఇస్తున్నప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. మరి అప్పు ఇచ్చినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే ఎదుటి వ్యక్తికి అప్పు ఇచ్చేముందు దానివల్ల మీకు ఏమైనా సమస్య వస్తుందా రాదా అని ఆలోచించి అప్పులు ఇయ్యాలి. అప్పులు ఇచ్చే ముందుగా ప్రతి నెల చెల్లించాల్సిన వాయిదాలు పొదుపు పథకాలు ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఆలోచించి అప్పులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా మనం అనుకున్న వాటికి అన్నిటికీ డబ్బులు పూర్తిగా సరిపోయి అదనంగా ఉన్నప్పుడు మాత్రమే అప్పులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవాలి. అంతే కాకుండా అప్పు ఇచ్చే వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది.. బంధువులకు లేదా స్నేహితులకు అప్పు ఇవ్వాలి తప్ప, దూరపు బంధువులకు లేదంటే, ముఖ పరిచయం ఉన్న వ్యక్తులకు డబ్బులు ఇచ్చి ఇబ్బందులు పడకూడదు. అయితే అప్పు తీసుకునేవారు డబ్బు చెల్లించకపోతే ఆర్థికంగా నష్టపోవడంతో పాటు డిస్టర్బ్ కూడా అవుతారు.

Also Read:  Job Offer For 10th Class Student: పదో తరగతి కుర్రాడికి రూ.33 లక్షల జాబ్ ఆఫర్!!

అయితే చాలామంది అప్పు అడిగారు కదా అని పెట్టుబడులను తాకట్టు పెట్టి మరి అప్పులు ఇస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. పెట్టుబడులను ఎలా ప్లాన్ చేశారో అలాగే కొనసాగించాలి. అప్పులు ఇవ్వడానికి వాటిని వాడుకోకూడదు. మీ దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తి కాస్త ఆలస్యంగా తిరిగి చెల్లించినా మీకు ఇబ్బంది లేదనుకుంటేనే అప్పు ఇవ్వాలి. అదేవిధంగా డబ్బులు ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మొహమాట పడకూడదు. డబ్బు ఇచ్చిన తర్వాత ఇప్పించుకోవడానికి మొహమాట పడితే నష్టపోతారు. అదేవిధంగా మొహమాట పడుతున్నారు కదా అని అప్పు ఇస్తే ఇబ్బందుల్లో పడేది కూడా మీరే. అందుకే మీరు అప్పు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే కుదరదని ధైర్యంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి.

మిమ్మల్ని స్వార్థపరులు అనుకున్నా ఆలోచించాల్సిన అవసరం లేదు. మొహమాటానికైనా మీరు అప్పు ఇస్తారని తెలిస్తే మీ దగ్గర అప్పు చేసేవారి జాబితా పెరిగిపోతుంది. మీ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడానికి మీరు వెనకడుగు వేయకూడదు. స్నేహితులు, బంధువుల దగ్గర తీసుకున్న అప్పుల్ని ఎప్పుడైనా తిరిగి ఇవ్వొచ్చులే అని చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. అందుకే మీకు చెప్పిన గడువు లోగా తిరిగి చెల్లించకపోతే మీ బాకీ మీరు అడగాల్సిందే. అవసరమైతే మరో నాలుగు రోజులు గడువు ఇవ్వండి. కానీ మీ డబ్బు మీరు అడిగి తీసుకోండి.

Also Read:  Incense Sticks: అగరబత్తులు వెలిగించడం వెన్నుకున్న అసలు రహస్యం ఏమిటంటే?